Nayanthara: వివాదంలో లేడీ సూపర్ స్టార్.. నయనతారపై కేసు నమోదు..

మధ్యప్రదేశ్‌లో రైట్ వింగ్ సంస్థ ఫిర్యాదు మేరకు నయనతారతో పాటు దర్శకుడు నీలేష్ కృష్ణ, నిర్మాతలు జతిన్ సేథీ, ఆర్ రవీంద్రన్, నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ హెడ్ మోనికా షెర్గిల్‌పై కేసు నమోదైంది. ఈ వివాదంతో నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా స్ట్రీమింగ్ నిలిపేస్తున్నట్లు ప్రకటించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 11, 2024 | 05:54 PMLast Updated on: Jan 11, 2024 | 5:54 PM

Case Filed Against Nayanthara For Annapoorani Movie

Nayanthara: హీరోయిన్‌ నయనతారపై కేసు నమోదైంది. ఇటీవల విడుదలైన సినిమా అన్నపూరణి సినిమాలో హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా సన్నివేశాలు ఉన్నాయని ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఫిర్యాదులు వచ్చాయి. దీంతో మధ్యప్రదేశ్‌లో రైట్ వింగ్ సంస్థ ఫిర్యాదు మేరకు నయనతారతో పాటు దర్శకుడు నీలేష్ కృష్ణ, నిర్మాతలు జతిన్ సేథీ, ఆర్ రవీంద్రన్, నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ హెడ్ మోనికా షెర్గిల్‌పై కేసు నమోదైంది.

NARA LOKESH: లోకేశ్‌పై సీనియర్ల తిరుగుబాటు.. ఇప్పుడు నాని.. నెక్ట్స్ ఎవరు..?

హిందువుల మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని, రాముడిని అగౌరపరిచారని, సినిమా ద్వారా లవ్ జిహాద్‌ని ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో ఆరోపించారు. నయనతార కెరీర్‌లో 75వ సినిమాగా వచ్చిన అన్నపూరణికి నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 1న ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఈ సినిమా పెద్దగా మెప్పించలేకపోయింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అయింది. ఈ సినిమాలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా.. రాముడు కూడా మాంసం తిన్నాడని, ఇది వాల్మీకి అయోధ్య కాండలో ఉంది అని ఓ డైలాగ్ ఉంది. ఇది వివాదాస్పదం అయింది. హీరో ఓ ముస్లిం అయి ఉండీ.. హీరోయిన్ ఓ బ్రాహ్మణ అమ్మాయిగా ఉండటాన్ని కూడా పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఇది లవ్ జిహాద్‌ని ప్రోత్సహించేలా ఉందని ఇప్పటికే తమిళనాడుతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ వివాదంతో నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా స్ట్రీమింగ్ నిలిపేస్తున్నట్లు ప్రకటించింది.