Book My Show : బుక్ మై షో మీద కేసు.. గరంగరంగా గుంటూరు కారం
త్రివిక్రమ్ (Trivikram Srinivas), మహేశ్ బాబు (Mahesh Babu) కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ గుంటూరు కారం. 11 ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్‌లో వచ్చిన మూవీ కావడంతో దీని గురించి అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కనిపించాయ్. పోస్టర్స్, టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్‌లో అంచనాలు మరింత పెరిగిపోయాయి. విడుదల తర్వాత.. వారి అంచనాలను మూవీ అందుకోలేకపోయింది.
త్రివిక్రమ్ (Trivikram Srinivas), మహేశ్ బాబు (Mahesh Babu) కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ గుంటూరు కారం. 11 ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్‌లో వచ్చిన మూవీ కావడంతో దీని గురించి అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కనిపించాయ్. పోస్టర్స్, టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్‌లో అంచనాలు మరింత పెరిగిపోయాయి. విడుదల తర్వాత.. వారి అంచనాలను మూవీ అందుకోలేకపోయింది. సినిమాకు నెగిటివ్ రివ్యూలే ఎక్కువగా వస్తున్నాయ్. ఇక అటు బుక్ మై షోలో గుంటూరు కారంకు కావాలని ఫేక్ ఓట్లు పడుతున్నాయని.. ఆ ప్లాట్‌ఫార్మ్‌పై లీగల్ యాక్షన్‌కు సిద్ధమయ్యారు మేకర్స్. బుక్ మై షో అనేది సినిమా టికెట్ బుకింగ్స్‌లోనే అతిపెద్ద ప్లాట్‌ఫార్మ్. దీని మీద గుంటూరు కారం టీమ్ కంప్లైంట్ ఫైల్ చేసిందట. బుక్ మై షోలో మోసపూరిత కార్యకలాపాలు జరుగుతున్నాయని ఫిర్యాదులో తెలిపింది.
గుంటూరు కారం (Guntur Karam) మూవీకి మిక్స్‌డ్ రివ్యూలు వస్తున్నాయి. ఐతే ప్రేక్షకులను మరింత ప్రభావితం చేయడం కోసం బుక్ మై షో (Book My Show) దాదాపు 70వేల బోట్స్‌ను క్రియేట్ చేసి సినిమాకు తప్పుడు రేటింగ్స్ ఇస్తూ.. తప్పుడు రివ్యూలను ఇస్తూ పరిస్థితిపై ప్రభావితం చేయాలని చూస్తుందని ఆరోపిస్తున్నారు మేకర్స్. ఈ విషయాన్ని ఫిల్మ్ ఛాంబర్ వరకు తీసుకెళ్లి.. అసలు ఏం జరిగిందో విచారించమని, వెంటనే యాక్షన్ తీసుకోమని మేకర్స్ కోరారు. ఈ విషయంపై ఫిల్మ్ ఛాంబర్ కూడా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ బుక్ మై షోకు లీగల్ నోటీసులు పంపడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఫేక్ ఓట్లు ఎవరు వేయించారో ఆరా తీయాలని యాప్ నిర్వాహకుల్ని కోరనున్నట్లు తెలుస్తోంది.
బుక్ మై షో రేటింగులపై ప్రేక్షకులకు మంచి అభిప్రాయం ఉంది. సినిమా కోసం టికెట్ బుక్ చేసే ముందు ఆడియన్స్ ఇచ్చే రివ్యూలను పరిగణనలోకి తీసుకొంటుంటారు సినీ అభిమానులు. ఆ రేటింగుల్ని కూడా ప్రభావితం చేస్తున్నారన్నరని గుంటూరు కారం టీమ్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇలాంటి సంఘటనలు ఎంటర్‌టైన్‌మెంట్ కమ్యూనిటీలో ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తాయని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయ్. బుక్ మై షోతో పాటు ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ కూడా ఇలాంటి యాక్టివిటీలలో పాల్గొంటున్నాయని.. అనవసరంగా సినిమాలపై నెగిటివ్ రివ్యూలు ఇచ్చి ప్రేక్షకుల నిర్ణయాన్ని ప్రభావితం చేస్తున్నాయని ఇండస్ట్రీ నిపుణులు అనుకుంటున్నారు.