1000 కోట్ల తర్వాతే సెలబ్రేషన్స్… 8 రోజుల్లో సెన్సేషన్..
దేవర మూవీ సక్సెస్ మీట్ తో ఫిల్మ్ టీం దుమ్ముదులుపుతుందనుకున్నారు. ఈసారి ఫ్యాన్స్ 30 వేలు కాదు, అంతకుమించి ఈ సెలబ్రేషన్స్ లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. కాని తీరా చూస్తే ప్రీరిలీజ్ ఈవెంట్ లానే ఇది కూడా క్యాన్సిల్ అయ్యింది.
దేవర మూవీ సక్సెస్ మీట్ తో ఫిల్మ్ టీం దుమ్ముదులుపుతుందనుకున్నారు. ఈసారి ఫ్యాన్స్ 30 వేలు కాదు, అంతకుమించి ఈ సెలబ్రేషన్స్ లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. కాని తీరా చూస్తే ప్రీరిలీజ్ ఈవెంట్ లానే ఇది కూడా క్యాన్సిల్ అయ్యింది. దేవర మామూలుగా హిట్ అయితే ఈపాటికే ఈసినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ కి ప్రభుత్వం పర్మీషన్ ఇచ్చేది.. కాని దేవర బ్లాక్ బస్టర్ అవటంతో, సక్సెస్ సెలబ్రేషన్స్ కి నోఛాన్స్ అంటున్నారు. బేసిగ్గా హిట్ అయిన మూవీకే సక్సెస్ సెలబ్రేషన్స్ చేస్తారు.. అలాంటప్పుడే ఎవరైనా పర్మీషన్ తీసుకుంటారు.. ఆఫీసర్స్ పర్మీషన్ కూడా ఇస్తారు. అలాంటిది హిట్ అయినా సెలబ్రేట్ చేసుకోనీయమంటే, అదే ఫ్యాన్స్ కి నచ్చట్లేదు. కాని దేవర వల్లే ఇదంతా జరిగింది. ఎన్టీఆర్ చేసిన పని వల్లే ఇలా అవుతోంది…
దేవర మూవీ టీం ఈ సినిమా విడుదలకు ముందు ప్రీరిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసింది. 4 వేల మంది వస్తారనుకుంటే, 30 వేల మంది ఫ్యాన్స్ రావటంతో, ఎన్టీఆరే ఈ ఈవెంట్ని క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. తన అభిమానులకు సరైన ఏర్పాట్లు అందించకపోతే, ఏదైనా జరిగితే, ఎలా అన్న కోణమే అసలు కారణం …
ఏదేమైనా దేవర హిట్టయ్యాక సక్సెస్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా చేద్దామనేసింది ఫిల్మ్ టీం. అలానే సక్సెస్ మీట్ ని ఏకంగా లక్షమందితో ప్లాన్ చేయబోయారు. ఈసారి ఫ్యాన్స్ లక్షమంది వరకు వచ్చినా గట్టిగానే ఈవెంట్ ప్లాన్ చేసే ఏర్పాట్లు జరిగాయి.
కట్ చేస్తే దేవర మామూలు సక్సెస్ కాలేదు, బ్లాక్ బస్టర్ అయ్యింది. అదే ఇప్పుడు ఈ సక్సెస్ మీట్ క్యాన్సిల్ అవటానికి కారణమైంది. బేసిగ్గా హిట్ అయితేనే, భారీగా సక్సెస్ సెలబ్రేషన్స్ జరుగుతాయి. కాని దేవర విషయంలో సీన్ రివర్స్ అవుతోంది. ఇది ఊహించిన దానికంటే ఎక్కువే సెన్సేషనే క్రియటే్ చేస్తోంది.
విడుదలైన 6 రోజుల్లోనే 400 కోట్లు రాబట్టి దూసుకెళుతోంది.
అందుకే ఈ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ కి పర్మషన్స్ రాలేదట. ఇదే ఇక్కడ విచిత్రమైన తిరకాసు… ఎందుకంటే, కేవలం దేవర ప్రీరిలీజ్ అంటేనే 4 వేల మందిని ఎక్స్ పెక్ట్ చేస్తే ముప్పై వేల మందికి పైనే ఫ్యాన్స్ వచ్చారు. పెద్ద హంగామా జరిగింది.
ఇప్పుడు దేవర పాన్ ఇండియా లెవల్లో 6 రోజుల్లో 400 కోట్లు రాబట్టిందంటే, ఇండస్ట్రీ లో ఇదో రికార్డు… అలాంటప్పుడు ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ని ఏకంగా లక్షమందికి ఏర్పాట్లు ప్లాన్ చేస్తే ఇంకేమన్నా ఉందా…? లక్షకు రెండు మూడు లక్షలని మించి వస్తే, సెక్యూరిటీ కష్టమే… అసలే దసరా పండగ సీజన్…
తెలంగాణలో దసరా అంటేనే పెద్ద పండగ… దీనికి తోడు బతుకమ్మ పండగ జరుగుతుంటే, ఈ తొమ్మిదిరోజులు పోలీస్ ప్రొటెక్షన్ అంతా అటువైపే ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఆతర్వాత దసరా రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలీసులకు భారీగా బందోబస్తు డ్యూటీలు ఉంటాయి… సో ఈ పండగ రోజుల్లో ఎలాంటి సినిమా సెలబ్రేషన్స్ కి బందో బస్తు ఏర్పాటు చేయటం కష్టం… దీనికితోడు దేవర సెన్సేషనల్ హిట్ అవటం వల్ల, లక్ష అనుకున్న దగ్గర రెండు మూడు లక్షల మంది ఫ్యాన్స్ వస్తే, ఏదైనా జరక్కూడనిది జరిగితే… సీనే మారిపోతుంది. అందుకే దేవర సెలబ్రేషన్స్ కి దసరా సీజన్ లో పర్మీషన్ కష్టం అన్నారట. దసరా తర్వాత అయితే ఓకే అన్నారని ప్రచారం జరుగుతోంది. అందుకే ఫిల్మ్ టీం సక్సెస్ ఈవెంట్ క్యాన్సిల్ అయినందుకు ఫ్యాన్స్ బాధపడొద్దంంటూ సారీ చెప్పింది.