Varun Tej: ఏదో మనసులో పెట్టుకునే రిసెప్షన్‌కి రాలేదా..?
అసలు ఒక స్టార్ హీరోతో, హీరోయిన్ పెళ్లి తాలూకు సందడే లేదు. తారక్ అండ్ కో, లేదంటే మీడియం రేంజ్ హీరోలు, టాలీవుడ్ పెద్దలు, దర్శక నిర్మాతలు.. అంతెందుకు హీరోయిన్లు కూడా పెద్దగా ఈ రిసెప్షన్‌ని పట్టించుకోలేదు. అసలు బాబాయ్ పవన్ కళ్యానే ఈ రిసెప్షన్‌కి రాలేదు.

Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)తో లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) పెళ్లి ఇటలీలో ఘనంగా జరిగింది. అక్కడే రిసెప్షన్ (reception) జరిగినా, మళ్లీ హైదరాబాద్‌లో కూడా మరో రిసెప్షన్ పెట్టారు. విచిత్రం ఏంటంటే ఈ రిసెప్షన్‌లో పెద్దగా తారలు కనిపించలేదు. అసలు ఒక స్టార్ హీరోతో, హీరోయిన్ పెళ్లి తాలూకు సందడే లేదు. తారక్ అండ్ కో, లేదంటే మీడియం రేంజ్ హీరోలు, టాలీవుడ్ పెద్దలు, దర్శక నిర్మాతలు.. అంతెందుకు హీరోయిన్లు కూడా పెద్దగా ఈ రిసెప్షన్‌ని పట్టించుకోలేదు.
Game Changer: దిల్ రాజా మజాకా.. ‘గేమ్ ఛేంజర్’ సాంగ్ లీక్.. ఇద్దరు అరెస్ట్..
అసలు బాబాయ్ పవన్ కళ్యానే ఈ రిసెప్షన్‌కి రాలేదు. తనంటే పొలిటీషియన్ ఏదో బిజీగా ఉన్నాడనుకోవచ్చు. ఎలాగూ ఇటలీలో పెళ్లికే ఎటెండ్ అయ్యాడు. కాబట్టి హైదరాబాద్ రిసెప్షన్ లైట్ తీసుకున్నాడనుకోవచ్చు. మరి దర్శక నిర్మాతలు, హీరోయిన్ల సంగతేంటి..? వరుణ్‌తో జోడీ కట్టిన హీరోయిన్లు కూడా తన రిసెప్షన్‌కి రాలేదంటే ఎక్కడ మిస్టేట్ జరిగింది..? ఆ ప్రశ్నకు సమాధానం పిలుపుల ప్రక్రియ సరిగ్గా జరక్కపోవటమేనట.
Devi Sri Prasad: డీఎస్పీకి మంచి రోజులొచ్చాయా.. క్యూ కడుతున్న భారీ ఆఫర్లు..
నాగబాబు, వరుణ్ తేజ్ తోటి హీరోలు, దర్శక నిర్మాతలకు వాట్సాప్ ద్వారా ఇన్విటేషన్ పంపించారట. ఫోన్‌కాల్స్‌తో ఇన్వైట్ చేశారట. ఇది సరైన పిలుపులు కావని, చాలా వరకు స్టార్స్, అలానే హీరోయిన్లు ఈ రిసెప్షన్‌కి ఆసక్తి చూపించలేదనే కామెంట్లు పెరిగాయి.