OTT CENSOR: ఓటీటీ వీక్షకులకు కేంద్రం షాక్.. ఇకపై ఆ వెర్షన్స్ ఉండవ్..
అసభ్యకర సన్నివేశాలు, డైలాగులపై అభ్యంతరం వ్యక్తం చేసిన కేంద్రం ఇకపై డిజిటల్ స్ట్రీమింగ్‌లకు సెన్సార్ నిబంధనలు విధించింది.

OTT CENSOR: ఓటీటీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం తాజాగా భారీ షాక్ ఇచ్చింది. ఇకపై ఓటీటీలో వచ్చే కంటెంట్‌కు కూడా సెన్సార్ ఉండాల్సిందేనని ఆదేశించింది. సాధారణంగా సెన్సార్ కంప్లీట్ అయ్యాకే థియేటర్లలో సినిమాను ప్రదర్శిస్తారు. మూవీలో ఏదైనా అదనపు సీన్స్ పెడితే సెన్సార్ బోర్డు చూసిన తర్వాతే మళ్లీ తెరపై అనుమతిస్తారు. అయితే ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు గతంలో అలాంటి పరిమితిలేదు.
SALAAR: సలార్ మేనియా.. రిలీజ్‌కి ముందే కొత్త రికార్డు
అక్కడ ప్రసారమయ్యే సినిమాలకు, వెబ్ సిరీస్‌లకు ఎలాంటి సెన్సార్ అవసరం లేకుండానే కంటెంట్ అందుబాటులో ఉంచేవి. పైగా.. అన్‌కట్, అన్ ఎడిటెడ్ వెర్షన్స్ అంటూ సినిమాలు, సిరీస్‌లను స్ట్రీమింగ్‌కు తీసుకు వస్తున్నాయి. వీటిలో అసభ్యకర సన్నివేశాలు, డైలాగులపై అభ్యంతరం వ్యక్తం చేసిన కేంద్రం ఇకపై డిజిటల్ స్ట్రీమింగ్‌లకు సెన్సార్ నిబంధనలు విధించింది. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌కు పలు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. దీంతో సెన్సార్ చేయని వెర్షన్‌ను ప్రసారం చేయవద్దని సెన్సార్ బోర్డు నెట్‌ఫ్లిక్స్‌ను ఆదేశించింది. రీసెంట్‌గా స్ట్రీమింగ్ అయిన ‘భీద్’ అనే సిరీస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఇతర రాజకీయ నేతల టాపిక్ ఉంది.
ఆ సన్నివేశాలను ఇప్పుడు పూర్తిగా కట్ చేశారు. కాగా సెన్సార్ బోర్డ్ సూచనల మేరకు నెట్‌ఫ్లిక్స్ తీసుకున్న నిర్ణయంతో ఓటీటీ ప్రేక్షకులు నిరాశ చెందుతున్నారు. అయితే మొన్న రిలీజైన ‘యానిమల్’ మూవీ పరిస్థితి ఏంటి? అని ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు. ఓటీటీలోనైనా ఫుల్ వెర్షన్‌ను చూడవచ్చని ఆశించిన ఓటీటీ లవర్స్‌కు కేంద్రం భారీ షాక్ ఇచ్చింది.