Showcase notices Bollywood Heroes : షారుక్, అక్షయ్, అజయ్ కి కేంద్ర నోటీసులు.. గుట్కా యాడ్స్ లో పాల్గొనందుకు.. షోకజ్ నోటీసులు

గతంలో ఈ ముగ్గురు స్టార్ హీరోలు ఓ హానికరమైన వాణిజ్య ప్రకటనల్లో పాల్గొన్నారు. ప్రజలకు హనీకరమైన గుట్కా సంబంధిత వాణిజ్య ప్రటనల్లో ఈ హీరోలు పాల్గొన్నారంటూ అలహాబాద్ హైకోర్టులో ఓ కేసు నమోదైంది. ఈ కేసులో కేంద్ర ప్రభత్వం ఈ బాలీవుడ్ అగ్రనేతలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan), అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar), అజయ్‌ దేవ్‌గణ్‌ (Ajay Devgn) ఈ నోటీసులు అందుకున్న మొదటి స్థానంలో వీరు ఉన్నారని అలహాబాద్‌ హైకోర్టు లఖ్‌ నవూ బెంచ్‌కు ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలియజేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 10, 2023 | 02:43 PMLast Updated on: Dec 10, 2023 | 2:43 PM

Central Notices To Shahrukh Akshay Ajay Showcase Notices For Participating In Gutka Ads

షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవ్ గణ్ హీరోలతో సినిమా ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ లో ఓ రేంజ్ లో ఫాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు.. బాలీవుడ్ లోనే కాదు.. ఇటు తెలుగులో కూడా వీరి నటనతో ప్రేక్షకుల మనసులు కొట్టేశారు. ఇప్పుడు వీరి గురించి ఎందుకు అంటారా.. తాజాగా వీరు ముగ్గురుపై ఓ కేసు నమోదైంది. అదేంటో తెలుసుకుందాం పదండి మరి..

గతంలో ఈ ముగ్గురు స్టార్ హీరోలు ఓ హానికరమైన వాణిజ్య ప్రకటనల్లో పాల్గొన్నారు. ప్రజలకు హనీకరమైన గుట్కా సంబంధిత వాణిజ్య ప్రటనల్లో ఈ హీరోలు పాల్గొన్నారంటూ అలహాబాద్ హైకోర్టులో ఓ కేసు నమోదైంది. ఈ కేసులో కేంద్ర ప్రభత్వం ఈ బాలీవుడ్ అగ్రనేతలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan), అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar), అజయ్‌ దేవ్‌గణ్‌ (Ajay Devgn) ఈ నోటీసులు అందుకున్న మొదటి స్థానంలో వీరు ఉన్నారని అలహాబాద్‌ హైకోర్టు లఖ్‌ నవూ బెంచ్‌కు ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలియజేశారు.

ఈ నోటీసులపై న్యాయవాది మాట్లాడుతూ.. అగ్ర నటులు కొన్ని అత్యంత హానికారక ఉత్పత్తులకు సంబంధించి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ మోతీలాల్‌ యాదవ్‌ అనే న్యాయవాది గతంలో అలహాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ హానీకరమైన గుట్కా యాడ్ చేస్తున్న ముగ్గురు అగ్రనేతలకు కూడా భారత ప్రభుత్వం నుంచి అత్యంత గౌరవప్రదమైన పురస్కారం “పద్మశ్రీ” పురస్కరం అందుకున్నవారు ఇలాంటి ప్రకటనల్లో పాల్గొనడం సరికాదని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీన్ని విచారించిన కోర్టు.. పిటిషనర్‌ అభ్యంతరాలపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని అప్పట్లో ఆదేశించినప్పటికి.. ప్రభుత్వం నుంచి ఇంత వరకు కూడా ఎలాంటి స్పందన రాకపోవడంతో.. ఇటీవల పిటిషనర్‌ మరోసారి కోర్టును ఆశ్రయించారు.

దీనిపై అలహాబాద్ కోర్టు స్పందిస్తు.. కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌బీ పాండే శుక్రవారం కోర్టుకు సమాచారం అందించారు. షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan), అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar), అజయ్‌ దేవ్‌గణ్‌ (Ajay Devgn)కు అక్టోబర్‌ 22నే షోకాజ్‌ నోటీసులు జారీ చేశామని వెల్లడించారు. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హం.
గతంలో బిగ్ బీ కూడా.. అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) కూడా ఈ తరహా ప్రకటనలు చేసి.. తర్వాత ఇటాంటి ప్రకటనకు స్వస్తీ పలుకుతూ.. తప్పుకొన్నారని న్యాయస్థానానికి పాండే గుర్తుచేశారు. అయినప్పటికీ.. ఓ గుట్కా కంపెనీ ఆయన ప్రకటనలను ప్రసారం చేయడంతో.. స్వయంగా అమితాబ్‌ నే సదరు కంపెనీకి లీగల్‌ నోటీసులు పంపారని చెప్పారు. మరోవైపు ఈ వ్యవహారంపై ఓ కేసు ఇప్పటికే సుప్రీంకోర్టు పరిధిలో ఉందని పాండే కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో పిటిషన్‌ను కొట్టివేయాల్సిందిగా కోరారు. వాదనలు విన్న కోర్టు.. దీనిపై తదుపరి విచారణను 2024 మే 9కి వాయిదా వేసింది.