చైతన్య – శోభిత పెళ్లి వెన్యూ అదే, ఆల్రెడీ వర్క్ స్టార్ట్

టాలీవుడ్ లో ఇప్పుడు అక్కినేని వారి ఇంట వివాహం అనే వార్త సంచలనం అవుతోంది. సమంతాకు విడాకులు ఇచ్చిన తర్వాత నాగ చైతన్య రెండో వివాహం శోభితను చేసుకుంటున్నాడు. ఎప్పటి నుంచో ఈ ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని...

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 4, 2024 | 07:30 PMLast Updated on: Nov 04, 2024 | 7:30 PM

Chaitanya Shobhitas Wedding Venue Is The Same Work Has Already Started

టాలీవుడ్ లో ఇప్పుడు అక్కినేని వారి ఇంట వివాహం అనే వార్త సంచలనం అవుతోంది. సమంతాకు విడాకులు ఇచ్చిన తర్వాత నాగ చైతన్య రెండో వివాహం శోభితను చేసుకుంటున్నాడు. ఎప్పటి నుంచో ఈ ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని… సమంతాతో పెళ్ళికి ముందే చైతన్య… జీవితంలో ఆమె వచ్చింది అంటూ ఎవరికి నచ్చింది వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇక సమంతా సింగిల్ గా ఉండటానికే ఇష్టపడుతున్నా చైతన్య మాత్రం గ్యాప్ ఎక్కువ ఇవ్వడానికి ఇష్టపడలేదు. సినిమాలు చేస్తూనే రెండో పెళ్లి చేసుకుంటున్నాడు.

ఈ పెళ్లి ఇప్పుడు టాలీవుడ్ లో సంచలనం అవుతోంది. గ్రాండ్ గా చేయాలని నాగార్జున కూడా ఫిక్స్ కావడంతో… ఎక్కడా రాజీ పడకుండా డబ్బులను చిల్ల పెంకుల మాదిరి విసిరేస్తున్నారు అని టాక్. ముందు ఈ పెళ్లి విదేశాల్లో చేసుకునే ఛాన్స్ ఉందనే వార్తలు వచ్చాయి. ఇటలీలో చేసుకుందాం అని చూసినా… అక్కడ ఇప్పుడు చలికాలం స్టార్ట్ కావడంతో పెళ్లి వేడుకలు గ్రాండ్ గా చేసుకోవడం సాధ్యం కాదు. అలాగే రాజస్థాన్ లో చేసుకోవాలని కూడా చూసినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత దుబాయ్ మాట కూడా వినపడింది.

కాని ఇప్పుడు హైదరాబాద్ లోనే చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఈ పెళ్లి పనులు ఇప్పటికే మొదలయ్యాయి కూడా. ఇటీవల దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అయింది. హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి పనులు ప్రారంభించే ముందు పసుపు కొడతారు. ముత్తైదువులు అందరూ హాజరై ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తారు. ఈ వీడియో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయింది. ఇక సోషల్ మీడియాలో పెళ్లి గురించి గాసిప్స్ కు కొదవలేదు. ఈ పెళ్ళికి సమంతా కూడా వస్తోందని ఆమెకు ఆహ్వానం పంపారని ప్రచారం జరిగింది.

ఇక ఈ పెళ్లి వేడుక ఎక్కడంటే… అన్నపూర్ణ స్టూడియోస్ లోనే నిర్వహించాలని ఫైనల్ చేసారు నాగార్జున. ఎక్కడికో వెళ్లి చేసుకోవడం కంటే ఇక్కడే గ్రాండ్ గా చేసుకుంటే బాగుంటుంది అని కుటుంబ సభ్యులు అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారట. ఇప్పటికే సెట్ కూడా వేయడం స్టార్ట్ అయిందని… డెకరేషన్ వర్క్స్ కూడా స్టార్ట్ చేసారని టాక్. డిసెంబర్ 4 న ఈ వివాహం అత్యంత గ్రాండ్ గా జరగనుంది. పెళ్లి తేదీ దాదాపుగా అదే ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ పెళ్లి వేడుకకు… తెలుగు రాష్ట్రాల సినీ రాజకీయ ప్రముఖులతో పాటుగా దేశ వ్యాప్తంగా ఉన్న వ్యాపార, రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.