పిల్లలపై చైతు సంచలనం, నాకు పెద్ద కోరికలు లేవు
టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. తన ప్రేయసి శోభిత దూలిపాళ్లను వివాహం చేసుకున్న చైతన్య... సోషల్ మీడియాతో పాటుగా ఎలక్ట్రానిక్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు.
టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. తన ప్రేయసి శోభిత దూలిపాళ్లను వివాహం చేసుకున్న చైతన్య… సోషల్ మీడియాతో పాటుగా ఎలక్ట్రానిక్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. అత్యంత ఘనంగా జరిగిన ఈ వివాహానికి సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన సెట్లో శోభిత చైతు వివాహాన్ని అత్యంత ఘనంగా జరిపారు కుటుంబ సభ్యులు. హిందూ సాంప్రదాయాలు ప్రకారం ఎనిమిది గంటల పాటు ఈ వివాహాన్ని నిర్వహించారు.
దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. సమంత నుంచి డైవర్స్ తీసుకున్న తర్వాత కొన్నాళ్లపాటు సింగిల్ గా ఉన్న చైతన్య… ఆ తర్వాత శోభితతో ప్రేమలో పడ్డాడు. సమంతతో వైవాహిక బంధం లో ఉన్నప్పుడే శోభితతో చైతన్యకు రిలేషన్ ఉంది అంటూ అనేక వార్తలు వచ్చాయి. వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ రావడానికి శోధిత కారణం అంటూ ప్రచారం కూడా జరిగింది. ఎట్టకేలకు వాటన్నింటినీ నిజం చేస్తూ చైతన్య శోభితను రెండో వివాహం చేసుకున్నాడు.
ఇందుకు గాను నాగచైతన్యకు పెద్ద ఎత్తున కట్నకానుకలు కూడా ఇచ్చినట్లుగా రూమర్స్ షేక్ చేస్తున్నాయి. చైతు, శోభితకు నాగార్జున టయోటా లెక్సస్ కారును కూడా కానుకగా ఇచ్చారు. చైతుకు హైదరాబాద్ లో ఒక విల్లా కానుకగా ఇచ్చారు అత్తా మామలు. అలాగే శోభిత కూడా ముంబైలో తన ఫ్లాట్ ను చైతుకు ఇచ్చింది. పెళ్లి తర్వాత ఇద్దరూ యూరప్ ట్రిప్ కు వెళ్లి కొన్నాళ్ళ పాటు అక్కడే ఉంటారట. ఆ తర్వాతనే తిరిగి ముంబై వచ్చి అక్కడ కొన్నాళ్ళు ఉంటారట. గత జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చి చైతూ కొత్త లైఫ్ ను స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యాడు.
నచ్చిన అమ్మాయిని వివాహం చేసుకొని జోష్ మీద ఉన్న చైతన్య తాజాగా రానా దగ్గుపాటి షోలో పాల్గొని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. తనకు ఒకరు లేదా ఇద్దరు పిల్లలు చాలు అంటూ కామెంట్ చేశాడు. వారితో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు. పిల్లల్లో కొడుకు ఉంటే తనతో గో కార్టింగ్ రేస్ తీసుకెళ్తానని కూతురైతే తనతో టైం స్పెండ్ చేసేందుకు ఇష్టపడుతున్నట్టు పేర్కొన్నాడు. ఆమె అభిరుచులకు తగ్గట్టు లైఫ్ ను లీడ్ చేసే స్వేచ్చ ఇస్తా అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా సమంతాతో చైతుకు పిల్లల వద్దనే విభేదాలు స్టార్ట్ అయ్యాయి అనే కామెంట్స్ కూడా వచ్చాయి. సమంతా సినిమాల కోసం పిల్లలు వద్దు అనుకుందని అది అక్కినేని ఫ్యామిలీకి నచ్చలేదు అంటూ రూమర్స్ షికారు చేసాయి.