Naga Chaitanya, : మేక్ఓవర్ కోసం అష్టకష్టాలు పడుతున్న చైతు.. న్యూ లుక్ వర్క్ అవుట్ అవుతుందా.. ?

కథ డిమాండ్ చేస్తే ఏదైనా చేస్తా, ఎంతైనా కష్టపడతా అంటున్నారు స్టార్స్. అలా చెప్పిన మాటల్ని చేతల్లో కూడా చూపిస్తున్నారు. షూటింగ్ కి ముందే జిమ్ లో చెమటలు చిందిస్తూ కొత్త మేకోవర్ కి షిప్ట్ అయిపోతున్నారు. తమ కటౌట్ తోనే సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ చేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 12, 2023 | 11:13 AMLast Updated on: Nov 12, 2023 | 11:13 AM

Chaitu Struggling For Makeover Will The New Look Work Out

కథ డిమాండ్ చేస్తే ఏదైనా చేస్తా, ఎంతైనా కష్టపడతా అంటున్నారు స్టార్స్. అలా చెప్పిన మాటల్ని చేతల్లో కూడా చూపిస్తున్నారు. షూటింగ్ కి ముందే జిమ్ లో చెమటలు చిందిస్తూ కొత్త మేకోవర్ కి షిప్ట్ అయిపోతున్నారు. తమ కటౌట్ తోనే సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ చేస్తున్నారు.

Pushpa 2 : పుష్ప2 లో ఐటెం సాంగ్ బ్యూటీ ఎవరు?.

కస్టడీ ట్రాక్ తప్పిన నాగచైతన్య ఇప్పుడు చందూ మొండేటి తో ఓ పాన్ ఇండియా మూవీ చేయడానికి ఓకే చెప్పాడు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో సాగనున్న ఈ సినిమాలో మత్స్యకార గ్రామానికి చెందిన వ్యక్తిగా కనిపించబోతున్నాడు. ఈ పాత్ర కోసం తన లుక్ మొత్తాన్ని మార్చేశాడు నాగాచైతన్య. ఇప్పుడు ఫిజిక్ ని కూడా మార్చుకునే పనిలో బిజీ అయ్యాడు. తన కొత్త ప్రాజెక్ట్ లో మరింత ఫిట్ గా కనిపించేందుకు జిమ్ లో తెగ కసరత్తులు చేస్తున్నాడు.

స్పై మూవీ ఫెయిల్యూర్ తో ట్రాక్ తప్పిన నిఖిల్ ఇప్పుడు స్వయంభు మూవీతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ కోసం వియత్నాం లో మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీలో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు.ఫిజికల్ గా కూడా న్యూ మేకోవర్ ట్రై చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

గుంటూరు కారం తో బిజీగా ఉన్న మహేష్ తర్వాత రాజమౌళితో ఓ పాన్ వరల్డ్ మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమా కోసం 3 నెలలు ట్రైనింగ్ తీసుకోబోతున్నాడట ప్రిన్స్. తన లుక్ నుంచి మేకోవర్ వరకు ప్రతిది ఈ ట్రైనింగ్ తోనే ముడిపడి ఉంటుందట. ఇక దేవరతో బిజీగా ఉన్న తారక్ జనవరిలో వార్ 2 షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడు. ఈ సినిమాలో తన లుక్ కోసం డిసెంబర్ నుంచి స్పెషల్ ఎక్సర్ సైజులు స్టార్ట్ చేయబోతున్నాడు. మొత్తానికి కథ కమాండ్ చేసిన కటౌట్ ని మార్చేందుకు ఏమాత్రం వెనుకాడడం లేదు యంగ్ హీరోలు.