కొడుకు కోడల్ని అమెరికా తీసుకెళ్తున్న చైతూ తల్లి

టాలీవుడ్ స్టార్ జంట అక్కినేని నాగచైతన్య శోభిత దూళిపాళ్ల ఇప్పుడు మంచి ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ప్రేమ వివాహం చేసుకున్న ఇద్దరు ప్రస్తుతం పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ పూజా కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు. అటు అక్కినేని నాగార్జున కూడా వీళ్ళిద్దరితో కలిసి దైవ క్షేత్రాలకు వెళ్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 9, 2024 | 02:31 PMLast Updated on: Dec 09, 2024 | 2:31 PM

Chaitus Mother Is Taking Her Son And Daughter In Law To America

టాలీవుడ్ స్టార్ జంట అక్కినేని నాగచైతన్య శోభిత దూళిపాళ్ల ఇప్పుడు మంచి ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ప్రేమ వివాహం చేసుకున్న ఇద్దరు ప్రస్తుతం పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ పూజా కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు. అటు అక్కినేని నాగార్జున కూడా వీళ్ళిద్దరితో కలిసి దైవ క్షేత్రాలకు వెళ్తున్నారు. తాజాగా శ్రీశైలం పర్యటనకు వెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు దేవాలయాలు అన్నీ తిరిగిన తర్వాత చైతన్య, శోభితఅమెరికా వెళ్లే అవకాశం ఉందని సినీవర్గాలు అంటున్నాయి.

నాగచైతన్య తల్లి లక్ష్మి అమెరికాలో ఉంటారు. ఆమె పెళ్లి కోసం హైదరాబాదు రాగా కొడుకుని కోడల్ని హైదరాబాదు నుంచి అమెరికా తీసుకెళ్లాలని ప్లాన్ చేశారట. దీనికి చైతన్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే శోభిత చైతన్య ఇద్దరు అమెరికా వెళ్లి అక్కడ కొన్నాళ్లు ఉండి తిరిగి రానున్నారు. ముందు యూరప్ వెళ్లాలనుకుని భావించిన్నా ఆ తర్వాత అది క్యాన్సిల్ చేసుకునే అమెరికా వెళుతున్నారట. ముందు సమంత, నాగచైతన్య వివాహం జరిగిన సమయంలో లక్ష్మీ ఇలాగే తీసుకెళ్లాలని భావించిన కొన్ని కారణాలు వల్ల వాయిదా పడింది.

ఇప్పుడు ఎలా అయినా సరే కొడుకు కోడలు ఇద్దరినీ అమెరికా తీసుకెళ్ళి కొన్నాళ్లు వారితో కలిసి ఉండాలని ఆమె భావిస్తున్నారట. చైతు చిన్నప్పటినుంచి ఎక్కువగా నాగార్జున వద్దనే పెరిగారు. తల్లితో బాండింగ్ ఉన్నా సరే చైతు నాగార్జున వద్దనే ఉండటంతో ఇప్పుడు ఇక తన తల్లి అడగడంతో కాదనలేక అమెరికా వెళుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక కోడలికి హైదరాబాదులో ఓ ఇంటిని కూడా ఆమె గిఫ్ట్ గా ఇచ్చారు. సమంతతో కూడా లక్ష్మికి మంచి అనుబంధమే ఉంది. చైతన్య సమంత విడిపోయే సమయంలో ఆమె కలపడానికి తీవ్రంగా ప్రయత్నించారని అంటారు.

కానీ ఇద్దరి మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ఉండటంతో సమంత ఒప్పుకోలేదని, అందుకే ఆమె సైలెంట్ అయిపోయారని అంటూ ఉంటారు. శోభితతో వివాహం విషయంలో లక్ష్మీ పెద్దగా జోక్యం చేసుకోకపోయినా చైతన్య పై ఉన్న ప్రేమతో ఆమె ఏమీ మాట్లాడలేదట. ఇక ఇప్పుడు కొన్నాళ్లు వారిద్దరిని తన వద్దనే ఉంచుకునేందుకు ఆమె రెడీగా ఉన్నారట. ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీ కూడా దీనికి అంగీకారం తెలిపినట్లు సమాచారం. ప్రస్తుతం నాగచైతన్య ఒక సినిమాతో బిజీగా ఉండగా అటు బాలీవుడ్ లో శోభిత బిజీగా ఉంది మరి వీళ్ళిద్దరూ అమెరికా వెళ్లి ఎన్నాళ్లు ఉంటారో. మళ్ళీ అఖిల్ పెళ్లి సమయానికి అక్కడి నుంచి తిరిగి రానున్నారని టాక్.