Chandramohan : హీరోయిన్లకు నిచ్చెనలా చంద్రమోహన్.. ఎంతోమందికి లక్కీ హీరో ఈయన.
సెంటిమెంట్లు లేని ఫీల్డ్ ఏదైనా ఉంటుందా.. సినిమాల్లో అయితే అదీ మరీ ఎక్కువ. అలాంటి సెంటిమెంట్లకు కేరాఫ్ చంద్రమోహన్. అలాంటి హీరో లేరు అన్న మాటే.. ఇప్పుడు చాలా మందితో కన్నీరు పెట్టిస్తోంది. తన నటనతో దాదాపు ఐదు దశాబ్దాల పాటు కోట్ల మంది సినిమా ప్రేమికులకు ఆనందాన్ని పంచిన చంద్రమోహన్ ఇక లేరు.

Chandramohan is like a ladder for heroines He is a lucky hero for many people
సెంటిమెంట్లు లేని ఫీల్డ్ ఏదైనా ఉంటుందా.. సినిమాల్లో అయితే అదీ మరీ ఎక్కువ. అలాంటి సెంటిమెంట్లకు కేరాఫ్ చంద్రమోహన్. అలాంటి హీరో లేరు అన్న మాటే.. ఇప్పుడు చాలా మందితో కన్నీరు పెట్టిస్తోంది. తన నటనతో దాదాపు ఐదు దశాబ్దాల పాటు కోట్ల మంది సినిమా ప్రేమికులకు ఆనందాన్ని పంచిన చంద్రమోహన్ ఇక లేరు. చంద్రమోహన్ ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు. మొత్తం 932 సినిమాల్లో ఆయన నటించారు. 1966లో రంగులరాట్నం సినిమాతో ఆయన సినీ ప్రస్థానం ఆరంభమైంది. అప్పటి నుండి సహనాయకుడిగా, కథనాయకుడుగా, హాస్యనటునిగా, క్యారెక్టర్ యాక్టర్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ప్రధానంగా కామెడీ పాత్రల ద్వారా చంద్రమోహన్ ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోతారు. ఇక కొత్త హీరోయిన్‌లకు లక్కీ హీరో చంద్రమోహన్ అని చెప్తారు. చంద్రమోహన్ పక్కన మొదటి సినిమాలో నటిస్తే ఆ హీరోయిన్ దశ తిరిగిపోతుందని చెబుతారు.
CHANDRA MOHAN: మొదటి సినిమాకే అవార్డ్.. అదీ చంద్రమోహన్ అంటే..
సిరిసిరిమువ్వలో జయప్రద, పదహారేళ్ళ వయసులో శ్రీదేవి తమ నటజీవితం ప్రాంభంలో చంద్రమోహన్‌తో నటించి తరువాత తారాపథంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు చంద్రమోహన్. 1983లో వచ్చిన పెళ్లి చూపులు సినిమాలో చంద్రమోహన్, విజయశాంతి కలిసి నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత వీరి కాంబోలో వచ్చిన ప్రతిఘటన కూడా బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది. చంద్ర మోహన్‌తో నటించిన తర్వాతే విజయశాంతి శోభన్‌బాబు, నాగేశ్వరరావు, చిరంజీవిలాంటి స్టార్ హీరోలతో నటించింది. హీరోగా రంగులరాట్నం చిత్రంతో మొదలుపెట్టి, హాస్యనటుడిగా మారి తర్వాత కాలంలో కారెక్టర్ ఆర్టిస్ట్‌గా చిత్రసీమలో స్థిరపడ్డారు. చంద్రమోహన్ నటించిన సుఖదుఃఖాలు, పదహారేళ్ళ వయసు, సిరిసిరిమువ్వ, సీతామాలక్ష్మి మొదలైనవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆ కాలంలో వీరితో ఎందరో హీరోయిన్‌గా నటించి అగ్రస్థానాన్ని చేరుకున్నారు.