Pavitra : చందు, పవిత్ర సంబంధంపై… భార్య సంచలన వ్యాఖ్యలు.. చనిపోయే ముందు రోజు ఏం జరిగిందంటే..
తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయ్. రోజుల వ్యవధిలోనే ఇద్దరు సీరియల్ నటులు చనిపోవడం ప్రతీ ఒక్కరిని షాక్‌కు గురి చేస్తోంది.

Chandu and Pavitra's relationship... Wife's sensational comments.. What happened the day before she died..
తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయ్. రోజుల వ్యవధిలోనే ఇద్దరు సీరియల్ నటులు చనిపోవడం ప్రతీ ఒక్కరిని షాక్‌కు గురి చేస్తోంది. ఐదు రోజుల కింద కారు ప్రమాదంలో నటి పవిత్ర చనిపోగా.. ఆమెను గుర్తు చేసుకుంటూ.. డిప్రెషన్ లోకి వెళ్లి నటుడు చందు ఆత్మహత్య చేసుకున్నాడు. పవిత్ర లేనిది తాను లేనని అంటూ లాస్ట్ మెసేజ్ పెట్టి మరీ.. ప్రాణాలు తీసుకున్నాడు. ఐతే చందు, పవిత్రల సంబంధంపై.. ఆయన భార్య శిల్ప సంచలన కామెంట్లు చేశారు.
ఐదేళ్లుగా నటి పవిత్ర (Pavitra) తో.. చందు డేటింగ్‌లో ఉన్నాడని చెప్పింది. చందు తన వెంటపడి ప్రేమించి తనను పెళ్లి చేసుకున్నాడని.. తమకు ఇద్దరు పిల్లలు ఉన్నారని భార్య శిల్ప వివరించింది. త్రినయని సీరియల్ ప్రాజెక్ట్ వచ్చిన నుంచి పవిత్రతో సంబంధం మొదలైందని.. పవిత్రతో రిలేషన్‌లో ఉంటూ తనను పిల్లల్ని వదిలేశాడని.. చందు తనతో ఐదేళ్ల నుండి మాట్లాడడం లేదని ఆయన భార్య తెలిపింది. పెళ్లి అయ్యాక కూడా వేరే మహిళతో కొనసాగించే సంబంధాలు చాలా మంది.. జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్న శిల్ప.. పవిత్ర మీద చందు విపరీతమైన ప్రేమ పెంచుకున్నాడని వివరించింది.
పవిత్రకు చందు కాకుండా ముందు కూడా రిలేషన్స్ ఉన్నాయని సంచలన కామెంట్లు చేసింది. పవిత్ర మాయలో పడి చందు ఈ విధంగా అయ్యాడనియ… పవిత్ర సడెన్‌గా చనిపోవడంతో.. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడని తెలిపింది. మూడు రోజుల కింద చేయి కోసుకొని.. నీ దగ్గరికి వస్తున్నా పవిత్ర అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడని.. ఎంత ట్రై చేసిన ఎవరి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో తన ఫ్లాట్‌కు తెలిసిన వాళ్ళని పంపించామని అక్కడ డోర్ పగలగొట్టి చూస్తే.. సూసైడ్ చేసుకొని ఉన్నాడని చెప్పింది.