Charan: చెర్రీ బన్నీ మధ్య గాప్ పెరిగిపోయిందా? అందుకే బర్త్ డే ని మిస్ చేశాడా?

బాలీవుడ్‌కే పరిమితమైన పార్టీల ట్రెండ్‌ టాలీవుడ్‌కూ పాకింది. హిందీ వాళ్లకు ధీటుగా బర్త్‌డే సెలబ్రేషన్స్‌ జరుపుకుంటున్నారు. రామ్‌చరణ్‌ ఎప్పుడూ లేనిది తన పుట్టినరోజున పెద్ద పార్టీ ఇచ్చాడు. పార్టీ అయితే గ్రాండ్‌గా జరిగిందిగానీ..అల్లు అర్జున్ మాత్రం ఆ పార్టీ కి దూరంగా ఉన్నాడు. చెర్రీ బన్నీ ని పిలువ లేదా? పిలిచినా బన్నీ వెళ్లలేదా? ఇదే ఇప్పుడు ఇండస్ట్రీ లో టాక్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 29, 2023 | 01:10 PMLast Updated on: Mar 29, 2023 | 1:10 PM

Charan Bunny Isuee

రామ్‌చరణ్‌ తన పుట్టినరోజున గతంలో ఇలా సినిమా ఇండస్ట్రీకి పార్టీ ఇచ్చింది లేదు. ఇలాంటి సెలబ్రేషన్స్‌ ఫ్యామిలీ వరకే పరిమితమయ్యేవి. ఈసారి గ్రాండ్‌గా ఇవ్వడానికి చాలా కారణాలున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్‌తో పాన్‌ ఇండియా ఇమేజ్‌ రావడం.. ఆస్కార్‌ పుణ్యమా అని.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు.. మార్కెట్‌ పెరగడం.. మరో వైపు తండ్రి కావడం. ఇలా చాలా హ్యాప్‌ న్యూస్‌తో ఏడాది గడిచిపోయింది. దీంతో… కావాల్సిన వారందినీ పిలిచి పార్టీ ఇచ్చాడు రామ్‌చరన్‌.

రామ్‌చరణ్‌ తండ్రి కాబోతున్నాడని ఎనౌన్స్ చేసి చాలాకాలమైంది. అయితే అలా కనిపించడం లేదన్న కామెంట్స్‌కు రామ్ చర్‌ బర్త్‌డే పార్టీ సమాధానం ఇచ్చింది. రామ్‌చరణ్‌తో దిగిన ఫొటోల్లో బేబీ బంప్‌తో కనిపించింది ఉపాసన. రామ్‌చరణ్‌ బర్త్‌డే ఈవెంట్‌లో ఆస్కార్ విజేతలను చిరంజీవి సన్మనించారు. రాజమౌళి, కీరవాణి దంపతుల్ని మెగాదంపతులు సాలువాతో సన్మానించారు. ఇదే వేదికపై గాయకులు రాహుల్- కాల భైరవ.. కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ .. ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్ర నిర్మాత డి.వి.వి దానయ్యని మెగా దంపతులు సన్మానించారు.

పాన్‌ ఇండియా హిట్స్‌ రావడం ఇలాంటి పార్టీలకు కారణమైంది. పుష్ప, ఆర్ఆర్‌ఆర్‌ ఇండియాలో రిలీజైన అన్ని లాంగ్వేజెస్‌లో హిట్‌ కావడంతో… సక్సెస్‌ పార్టీలుచేసుకున్నారు. ఆర్‌ఆర్ఆర్‌ టీంకు తెలుగులో దిల్‌ రాజు.. హిందీలో పెన్‌ ఇండియా సంస్థ గ్రాండ్‌పార్టీ ఇచ్చింది. బాలీవుడ్‌లో ఇలాంటి పార్టీలు కామనే కావడంతో… మన పాన్‌ ఇండియా హీరోలు సైతం ఆ కల్చర్‌ను అలవాటు చేసుకున్నారు.
పుష్ప పాన్‌ ఇండియా సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ను బన్నీ చేసుకోలేకపోయాడు. గత ఏడాది పుట్టినరోజు సందర్భంగా సెర్బియాలోని ఓ రెస్టారెంట్‌లో నిర్వహించిన బర్త్‌డే పార్టీకి 50 మందిని ఆహ్వానించి అందరి సమక్షంలో కేక్‌ కట్‌ చేశాడు బన్నీ. ఒకరకంగా ఈ బర్త్‌డే పార్టీ పుష్ప సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ కిందే లెక్క. చిత్ర యూనిట్‌లో ఎవరూ కనిపించకపోయినా.. స్నేహితులు… సన్నిహితుల కోసం ఈపార్టీని ఎరేంజ్‌ చేశాడు.

రామ్‌చరణ్‌ బర్త్‌డే గ్రాండ్‌గా జరిగినా… స్టార్స్‌ లేరన్న వెలితి కనిపించింది. మంచి స్నేహితుడైన ఎన్టీఆర్‌ ఎందుకు రాలేదు? బెస్ట్ ఫ్రెండ్‌ బర్త్‌డేనాడు తారక్‌ కనిపించకపోవడం ఏంటంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొరటాల సినిమా షూటింగ్‌ మొదలైందని.. రాత్రి పూట షూటింగ్‌ జరుపుకుంటోందని.. అందుకో రాలేదన్నట్టుగా చెబుతున్నారు.
చెర్రీ బర్త్‌డేనాడు… అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీ మాత్రమే కనిపించారు. యంగ్ హీరోలు చాలామంది విజయ్‌ దేవరకొండ, అడవి శేషు.. సిద్దు జొన్నలగడ్డ… కనిపించారు. మహేశ్‌ సినిమా హైదరాబాద్‌లోనే నడుస్తున్నా హాజరు కాలేదు. ఇలాంటి పార్టీల్లో పెద్దగా కనిపించని పవన్‌కల్యాణ్‌ను రాలేదని ఎవరూ అనుకోవడం లేదు. అయితే బన్నీ కనిపించకపోవడం షాక్‌ ఇస్తోంది. బన్నీ కావాలనే చెర్రీ పార్టీ ని ఎగ్గొట్టాడని టాక్ నడుస్తుంది. రెండు మూడేళ్ళుగా ఫ్యామిలి మద్య దూరం పెరిగిన విషయం తెలిసిందే.