‘ఛత్రపతి’లో స్టార్ట్ చేసిన ట్రెండ్ ‘కంగువ’లో కంటిన్యూ అయిందా…?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 12, 2024 | 03:23 PMLast Updated on: Aug 12, 2024 | 3:25 PM

Chatrapathi Trend Continued In Kanguva

భయంకరమైన జంతువులను చూస్తే మన గుండె జారిపోతుంది. బ్రతుకు జీవుడా అంటూ వాటి నుంచి దూరంగా పరుగులు తీస్తాం. అలాంటిది సినిమాల్లో మన స్టార్ హీరోలు వాటితో యుద్దాలు, పోరాటాలు చేస్తుంటే కళ్ళు ఆర్పకుండా చూస్తాం. వాటిని చంపేస్తే హీరోని చూసి పొంగిపోతాం… ఇప్పుడు ఇండియన్ సినిమాలో ఈ ట్రెండ్ బాగా కనపడుతుంది. క్రూర మృగాలతో హీరోలు పోరాటాలు చేసే సన్నివేశాలకు మంచి క్రేజ్ ఉండటంతో దర్శకులు అందరూ అదే ఫాలో అవుతున్నారు. మరి అసలు ఈ ట్రెండ్ స్టార్ట్ చేసింది ఎవరై ఉంటారు…?

ఆయనే మన దర్శక ధీరుడు రాజమౌళి… అసలు ఈ ట్రెండ్ ఎక్కడ స్టార్ట్ అయిందో మీకు గుర్తుందా…? ప్రభాస్ హీరోగా వచ్చిన ఛత్రపతి సినిమా నుంచి. ఆ సినిమాలో స్టార్టింగ్ సీన్ లో ప్రభాస్ సొర చేపతో పోరాటం చేసి బయట పడతాడు. ఆ సీన్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కడి నుంచి రాజమౌళి మనుషులతో పాటు జంతువులను కూడా వాడుకోవడం మొదలుపెట్టారు. బాహుబలి సినిమాలో రానా ఎద్దుతో పోరాటం చేస్తాడు. ఆ సీన్ గ్రాఫిక్స్ అయినా కూడా ఫ్యాన్స్ కి బాగా నచ్చింది. మొదటి పార్ట్ లో ఆ సీన్ హైలెట్ అయిందని చెప్పాలి.

ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమాలో పులితో ఎన్టీఆర్ పోరాటం చేసే సీన్ పెట్టాడు రాజమౌళి. ఈ సీన్ కూడా జనాలను బాగా ఆకట్టుకుంది. అలా జంతువులతో పోరాటం చేసే సీన్లకు మంచి క్రేజ్ రావడంతో మన హీరోలు అలాంటి సీన్లను ఇష్టపడుతున్నారు. మన్యం పులి సినిమాలో పులితో మోహన్ లాల్ చేసే పోరాటం బాగా హిట్ అయిన సంగతి తెలిసిందే. అలాగే లియో సినిమాలో విజయ్ హైనాతో పోరాటం చేస్తాడు. ఈ సీన్ అంతగా ఆకట్టుకోలేదు గాని రాజమౌళి సినిమాల్లో జంతువులతో పోరాటం చేసే సీన్లకు మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు కంగువా సినిమాలో సూర్య కూడా మొసలితో పోరాటం చేసే సీన్ ఉండబోతుంది. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ లో ఆ సీన్ చూపించారు. మరి ఇంకెన్ని జంతువులతో మన హీరోలు పోరాటం చేస్తారో చూడాలి. దర్శకులు ఇప్పుడు కమర్షియల్ సినిమాల్లో ఈ సీన్లను పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.