సినిమా చూసి ఏడుస్తున్నారు.. తెలుగోడికి స్లోగా ఎక్కేసిన ఛావా
సాధారణంగా కొన్ని సినిమాలు చాలా స్లోగా జనాలకు ఎక్కుతాయి. ముందు ఫ్లాప్ టాక్ వచ్చినా... సరే ఆ తర్వాత జనాలకు ఆ సినిమాలు నచ్చుతాయి. ముందు తిట్టిన వాళ్లే తర్వాత సినిమా చూసి ఆకాశానికి ఎత్తేస్తుంటారు.

సాధారణంగా కొన్ని సినిమాలు చాలా స్లోగా జనాలకు ఎక్కుతాయి. ముందు ఫ్లాప్ టాక్ వచ్చినా… సరే ఆ తర్వాత జనాలకు ఆ సినిమాలు నచ్చుతాయి. ముందు తిట్టిన వాళ్లే తర్వాత సినిమా చూసి ఆకాశానికి ఎత్తేస్తుంటారు. ఇప్పుడు ఛావా సినిమా పరిస్థితి కూడా అదే. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు చాలామంది పెదవి విరిచారు. మూడు నాలుగు సినిమాలను కలిపి ఒక సినిమా చేశారని కామెంట్ చేశారు. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా గ్రాండ్ గా లేదని మరి కొంతమంది… సినిమాలో అనుకున్నంత స్టఫ్ లేదని ఇంకొంతమంది ఎవరికి నచ్చిన కామెంట్స్ వాళ్ళు చేశారు.
కానీ సినిమా మాత్రం జనాలకు స్లోగా ఎక్కింది. రివ్యూలతో పని లేకుండా సినిమా చూడటం మొదలుపెట్టారు జనాలు. ఇక సినిమాలో విక్కీ కౌశల్… రష్మిక మందన యాక్టింగ్ కు జనాలు థియేటర్ల లో కన్నీరు పెట్టారు. ముఖ్యంగా నలభై నిమిషాలు సినిమా వేరే లెవెల్ లో ఉందంటూ డైరెక్టర్ ను యాక్టర్స్ ను తెగ పొగిడేస్తున్నారు. ఫస్ట్ రోజు కలెక్షన్లు 31 కోట్లు ఉంటే ఆ తర్వాత 39 కోట్లకు వెళ్లాయి. ఇక మూడవ రోజు అయిన ఆదివారం 49 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. సినిమా ఆదివారానికి ఈ సినిమా 121 కోట్లు వసూలు చేసింది.
వరల్డ్ వైడ్ గా ఛావా మొదటి రోజు కలెక్షన్స్ కూడా రికార్డు సృష్టించినట్లే. విక్కీ కౌశల్ కెరీర్ లో ఇంతవరకు మొదటి రోజున డబల్ డిజిట్ సాధించిన సినిమానే లేదు. ఆ లోటు ఛావా తీర్చేసింది. విక్కీ కౌశల్ సినిమాల్లో మొదటి రోజు బ్యాడ్ న్యూస్ 8.6 కోట్లు వస్తే… ఉరి సినిమాకు 8.2 కోట్లు, ఈ సినిమాను తక్కువ అంచనా వేసిన జాతీయ మీడియా ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది. ముఖ్యంగా సినిమాకు వెళ్ళిన వాళ్ళు థియేటర్లోనే శంబాజీ మహారాజును కీర్తిస్తూ నినాదాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు కొన్ని బయటకు వచ్చాయి.
క్లైమాక్స్ లో విక్కీ కౌశల్ ను చూసినవాళ్లయితే… అతని కెరీర్లో ఇది ది బెస్ట్ సినిమా అని, ఒక యాక్టర్ ఏం చేయగలడో అన్నీ చేసి చూపించాడని… విక్కీ కౌశల్ లో ఆకాశానికి ఎత్తేస్తున్నారు జనాలు. ఇక మన సౌత్ ఇండియాలో కూడా సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా పాన్ ఇండియా సినిమా అని.. హిందీలో విడుదల చేసి తప్పు చేశారని… తెలుగులో కూడా విడుదల చేయాల్సింది అని కోరుతున్నారు. కనీసం నెట్ఫ్లిక్స్ లో అయినా తెలుగు వెర్షన్ ఉండేలా చూసుకోవాలని.. అభిమానులు కోరడం గమనార్హం. ఈ సినిమాకు ఖచ్చితంగా 500 కోట్లకు పైగానే కలెక్షన్లు వచ్చే ఛాన్స్ కనబడుతోంది. మరో రెండు, మూడు రోజులు సినిమాకు రెస్పాన్స్ ఇదే రేంజ్ లో ఉండే అవకాశం ఉంది.