Adipurush: రాజకీయ ప్రకంపనలు రేపుతున్న ఆదిపురుష్‌ ఆ రాష్ట్రంలో మూవీపై నిషేధం ?

భారీ అంచనాల మధ్య విడుదలైన ఆదిపురుష్.. మొదటి రెండు రోజులు మొత్తం రికార్డులు.. కలెక్షన్ల మీదనే చర్చ నడిచింది. సినిమా కంటెంట్ మీద కొందరు విమర్శలు చేసినా.. పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 18, 2023 | 04:56 PMLast Updated on: Jun 18, 2023 | 4:56 PM

Chhattisgarh Chief Minister Shiv Sena Mp Priyanka Chaturvedi Are Furious Over Adipurush Demand To Stop The Movie Movie Team Is Fixed For New Print Release

ఐతే మూడో రోజు నుంచి సినిమా ఎలా ఉంది.. దర్శకుడు ఎలా తీశారు.. రామాయణ మహాకావ్యాన్ని తనకు తోచినట్లుగా దర్శకుడు ఎలా తీస్తారు.. అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయ్. ఆదిపురుష్‌ను చూసిన వారిలో దర్శకుడు ఓంరౌత్‌ను చాలామంది తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్న పరిస్థితి. రాముడు.. సీత.. రావణుడు.. ఇలాంటి ప్రధాన పాత్రాల్ని చూపించిన తీరు.. వారి చేత పలికించిన డైలాగుల్లో తప్పులపై సీరియస్ అవుతున్నారు. ఒక మైథలాజికల్ మూవీని తీసేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోకుండా తీస్తారా.. అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఐతే ఇలాంటి ప్రశ్నలు సామాన్యుల నోటి నుంచి కాకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నోటి నుంచి రావటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆదిపురుష్‌లోని కొన్ని డైలాగులు తప్పుగా ఉన్న విషయాన్ని ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ తప్పు పడుతున్నారు. సినిమాలో రాముడు.. హనుమంతుడి ప్రతిష్ఠను కించపరిచే ప్రయత్నం జరిగిందన్న ఆయన.. అవసరమైతే ఈ సినిమాను తమ రాష్ట్రంలో బ్యాన్ చేసేందుకు వెనుకాడమని వార్నింగ్ ఇచ్చేశారు. ఇక అటు భారతీయ ఇతిహాసమైన రామాయణాన్ని ఆధారంగా చేసుకొని తీసిన ఆదిపురుష్ టీం వెంటనే.. జనాలకు క్షమాపణలు చెప్పాలంటూ శివసేన ఎంపీ ప్రియాంకా చతుర్వేది డిమాండ్ చేశారు.

రోజులు గడిచే కొద్దీ ఈ విమర్శల తీవ్రత పెరిగితే.. సినిమా పరిస్థితి ఏంటి అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో మూవీ టీమ్ అలర్ట్ అయినట్లు కనిపిస్తోంది. అందుకే అభ్యంతరక డైలాగ్‌లు తీసేసి.. కొత్త ప్రింట్ రిలీజ్ చేయాలని డిసైడ్ అయింది. మరి దీంతో అయినా వివాదం ఆగుతుందో లేదో మరి చూడాలి.