జానీ మాస్టర్ అప్పటి నుంచే ఆ అమ్మాయిని,

టాలీవుడ్ లో ఇప్పుడు జానీ మాస్టర్ వ్యవహారం సంచలనం అయింది. జూనియర్ డాన్సర్ ని ఆయన వేధించారని కేసు నమోదు అయింది. తనను కారవాన్ లో జానీ మాస్టర్ వేధిస్తున్నాడు అని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 17, 2024 | 11:24 AMLast Updated on: Sep 17, 2024 | 11:24 AM

Chinmayi Tweet About Jani Mastar

టాలీవుడ్ లో ఇప్పుడు జానీ మాస్టర్ వ్యవహారం సంచలనం అయింది. జూనియర్ డాన్సర్ ని ఆయన వేధించారని కేసు నమోదు అయింది. తనను కారవాన్ లో జానీ మాస్టర్ వేధిస్తున్నాడు అని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు. ఈ వ్యవహారంలో జానీ మాస్టర్ ని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. స్టార్ హీరోలకు కోరియోగ్రఫీ చేసిన జానీ మాస్టర్ కెరీర్ ఇక్కడి నుంచి దాదాపుగా ఆగిపోయే సూచనలే కనపడుతున్నాయి. దీనిపై సినీ పెద్దలు కూడా ఆరా తీసినట్టు సమాచారం.

ఈ వ్యవహారంతో సినిమా పరిశ్రమలో మహిళల భద్రతపై మరోసారి అనుమానాలు మొదలయ్యాయి. అయితే జానీ మాస్టర్ ని సపోర్ట్ చేసే వాళ్ళు మాత్రం దీని వెనుక రాజకీయ కారణాలు ఉండవచ్చు అంటున్నారు. జానీ మాస్టర్ వైసీపీ అధినేత జగన్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తూ వచ్చారు. దాని కారణంగానే ఆయనను వైసీపీ టార్గెట్ చేసింది అంటున్నారు. పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇచ్చే జానీ మాస్టర్… ఇటీవలి కాలంలో కాస్త దూకుడుగా వ్యాఖ్యలు చేసారు. అందుకే ఈ పరిణామాలు ఎదుర్కొంటున్నారని సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది.

ఇదిలా ఉంచితే ఈ వ్యవహారంపై సింగర్ చిన్మయి సంచలన ట్వీట్ చేసారు. పలు మీడియా పోస్ట్ లను ట్యాగ్ చేస్తూ… రిపోర్ట్ ల ప్రకారం జానీ మాస్టర్ ఆ అమ్మాయి మైనర్ గా ఉన్నప్పటి నుంచే వేధించడం మొదలుపెట్టాడని ఆమె పేర్కొన్నారు. ఈ కేసులో పోరాడేందుకు ఆ అమ్మాయికి కావాల్సిన శక్తి చేకూరాలని కోరుకుంటున్నా అంటూ చిన్మయి పోస్ట్ చేసారు. గతంలో చిన్మయి ఈ తరహా వ్యవహారాలపై పలువురిపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. సింగర్ కార్తిక్, రచయిత వైరముత్తు సహా పలువురిపై విమర్శలు చేసారు.