CHIRANJEEVI: ‘అల్లు’కి దూరంగా.. మెగా హీరోలు..
అల్లు కాంపౌండ్‌కి, మెగా కాంపౌండ్‌కి దూరం పెరిగిందని ఎప్పటి నుంచో గుసగుసలొస్తున్నాయి. అవన్నీ వట్టి రూమర్సే అని నిర్మాత అరవింద్ నుంచి మెగాస్టార్ చిరు వరకు, బన్నీ నుంచి చరణ్ వరకు ఎంతమంది క్లారిటీ ఇచ్చినా వచ్చే పుకార్లు వస్తూనే ఉన్నాయి.
CHIRANJEEVI: మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో సెకండ్ ఇన్నింగ్స్ అంతా బయటి నిర్మాతలతోనే చేస్తున్నారు. లేదా సొంత బ్యానర్ కొణిదెల క్రియేషన్స్‌లోనే సినిమాలు చేశాడు. కాని ఒక్కటంటే ఒక్కటి కూడా గీతా ఆర్ట్స్‌లో మూవీ చేయలేదు. దానికి కారణం చిరుతో అల్లుకున్న అరవింద్ బందం వీకైందని, అందుకే కాంబినేషన్‌లో సెన్సేషన్ రావట్లేదన్నారు.
Allu Arjun: అరుదైన గౌరవం.. బెర్లిన్‌కు అల్లు అర్జున్.. ఎందుకో తెలుసా..?
నిజానికి ఇలా అల్లు కాంపౌండ్‌కి, మెగా కాంపౌండ్‌కి దూరం పెరిగిందని ఎప్పటి నుంచో గుసగుసలొస్తున్నాయి. అవన్నీ వట్టి రూమర్సే అని నిర్మాత అరవింద్ నుంచి మెగాస్టార్ చిరు వరకు, బన్నీ నుంచి చరణ్ వరకు ఎంతమంది క్లారిటీ ఇచ్చినా వచ్చే పుకార్లు వస్తూనే ఉన్నాయి. అయితే నిజంగా చిరుకి, అల్లు అరవింద్ ఫ్యామిలీతో దూరం లేకుంటే మరెందుకు గీతా ఆర్ట్స్‌లో చిరు సినిమాలేవి రావట్లేదనే ప్రశ్న ఎదురౌతోంది. అక్కడే అల్లు అరవింద్ మిస్టేక్ చేశారంటున్నారు.
కత్తిలాంటి కథ, దర్శకుడితో అల్లు అరవింద్ వస్తే చిరు డేట్లివ్వటం వెరీ నార్మల్. గతంలో అలానే చేశాడు. అయితే చిరు రేంజ్ కథల్ని, దర్శకులని పట్టుకోవటంలో ఈ నిర్మాత సక్సెస్ కాలేకపోయాడని, సాలిడ్ కథ దొరికితే, మెగా ప్రాజెక్ట్ కన్ఫామ్ అనేది మరో వర్షన్. అలా చూస్తే అల్లు, మెగా గ్యాప్ రూమరే తప్ప మరొకటి కాదనే అనుకోవాలా? సీన్ చూస్తే అలానే ఉంది.