CHIRANJEEVI: మెగా ఫ్యామిలీని గట్టెక్కించేది ఎవరు..? ఈ హీరోలైనా సక్సెస్ కొడతారా..?
చిరంజీవి.. పవన్.. రామ్‌చరణ్ ఇప్పట్లో కనిపించకపోవడంతో.. మెగా ఫ్యామిలీ సక్సెస్ భారం వరుణ్‌తేజ్, వైష్ణవ్‌తేజ్‌పై పడింది. మెగా ఫ్యామిలీ సక్సెస్ భారం ప్రస్తుతం ఇద్దరు యంగ్ హీరోలపైనే వుంది. ఎందుకంటే ఆ ఇద్దరి సినిమాలు ఈ ఏడాదే రిలీజ్ అవుతున్నాయి.
CHIRANJEEVI: మెగా హీరోల్లో ఒక్కడే ఫామ్‌లో వున్నాడు. రెండేళ్ల క్రితం పుష్పతో హిట్ కొట్టిన అల్లు అర్జున్ తప్ప మరో హీరో సక్సెస్‌లో లేడు. అదేమిటో.. మెగా హీరోలను ఫ్లాపులు వెంటాడుతున్నాయి. మెగా ఫ్యామిలీని మెగా ఫ్లాపుల నుంచి గటెక్కించే హీరో ఎవరు..? చిరంజీవి కెరీర్‌లో ఆచార్యనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అనుకుంటే.. భోళా శంకర్ అంతకు మించి నష్టాలు తీసుకొచ్చింది. మెగా ఇమేజ్ డ్యామేజ్ అయినా.. వాల్తేరు వీరయ్యలా మళ్లీ బౌన్స్‌బ్యాక్ అవుతాడన్న నమ్మకంతో మెగా ఫ్యాన్స్ వున్నారు. భోళా తర్వాత ఒకేసారి రెండు సినిమాలు ఎనౌన్స్ చేసినా.. సెట్స్‌పైకి రావడానికి టైం పడుతుంది.
బింబిసార ఫేం వశిష్ట డైరెక్షన్‌లో నటించే సినిమా ముందుగా మొదలైతే.. ఈ హై బడ్జెట్ మూవీ ఏడాది పాటుసెట్స్‌పైనే వుంటుంది. ఈ లెక్కన 2024లో మెగాస్టార్ కనిపించడం డౌటే. పవన్ ఈ ఏడాది బ్రో మూవీతో ముందుకొస్తే.. సినిమా వీకెండ్ కలెక్షన్స్‌కే పరిమితమైంది. సినిమాను రూ.90 కోట్లకు అమ్మితే.. రూ.70 కోట్లు కూడా రాలేదు. పవర్‌స్టార్ చేతిలో మూడు సినిమాలున్నా ఏది ముందు పూర్తి చేసి ఎప్పుడు వస్తాడో తెలీదు. ఆర్‌ఆర్‌ఆర్‌తో రామ్‌చరణ్ కాస్తా గ్లోబల్ స్టార్ అయ్యాడు. శంకర్ చేతిలో పడ్డాడు ఇంకేముందనుకుంటే.. ఆచార్య ఈ మెగా హీరోను డిజప్పాయింట్ చేసింది. చెర్రీ సక్సెస్ చూడాలంటే.. గేమ్ ఛేంజర్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. అది ఎప్పుడు వస్తుందో నిర్మాత దిల్ రాజు కూడా చెప్పలేకపోతున్నాడు. వచ్చే ఏడాది వచ్చినా సెకండాఫ్‌లోనే. మెగా ఫ్యామిలీ సక్సెస్ భారం ప్రస్తుతం ఇద్దరు యంగ్ హీరోలపైనే వుంది. ఎందుకంటే ఆ ఇద్దరి సినిమాలు ఈ ఏడాదే రిలీజ్ అవుతున్నాయి.
ముందుగా వైష్ణవ్ తేజ్ నవంబర్ 10న ఆదికేశవ్ మూవీతో వస్తున్నాడు. ఉప్పెనలా మరో బ్లాక్‌బస్టర్ కొట్టి మెగా పరువు నిలబెడతాడేమో చూడాలి మరి. గద్దలకొండ గణేశ్ తర్వాత వరుణ్ తేజ్ సరైన సక్సెస్ చూడలేకపోయాడు. ఆమధ్య వచ్చిన గాండీవధారి అర్జున అయితే రూ.5 కోట్లు కూడా కలెక్ట్ చేయలేదు. డిసెంబర్ 8న ఆపరేషన్ వాలెంటేన్‌తో అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. చిరంజీవి.. పవన్.. రామ్‌చరణ్ ఇప్పట్లో కనిపించకపోవడంతో.. మెగా ఫ్యామిలీ సక్సెస్ భారం వరుణ్‌తేజ్, వైష్ణవ్‌తేజ్‌పై పడింది.