Bhola Shankar: చేయని తప్పుకి మెగా హీరోలకి శిక్ష పడిందా..?
మోహర్ రమేష్ చేసిన తప్పు వల్ల చిరు ట్రోలింగ్‌కి గురయ్యారు. అంతకుముందు పవన్ కళ్యాణ్ కూడా బ్రో ఫ్లాప్‌తో ట్రోలింగ్‌కి గురయ్యాడు. విచిత్రం ఏంటేంటే.. ఆ సినిమాలో పవన్‌ది గెస్ట్ రోలే అయినా, పవనే టార్గెట్ అయ్యాడు. ఫ్యాన్స్ మాత్రం త్రివిక్రమ్‌ని తిడితే, మిగతా నెటిజన్స్ పవన్‌నే టార్గెట్ చేసుకున్నారు.
Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి మీద మొన్నటి వరకు ట్రోలింగ్ జరిగింది. భోళా శంకర్ డిజాస్టర్ వల్లే ఇలా జరిగింది. మోహర్ రమేష్ చేసిన తప్పు వల్ల చిరు ట్రోలింగ్‌కి గురయ్యారు. అంతకుముందు పవన్ కళ్యాణ్ కూడా బ్రో ఫ్లాప్‌తో ట్రోలింగ్‌కి గురయ్యాడు. విచిత్రం ఏంటేంటే.. ఆ సినిమాలో పవన్‌ది గెస్ట్ రోలే అయినా, పవనే టార్గెట్ అయ్యాడు.
ఫ్యాన్స్ మాత్రం త్రివిక్రమ్‌ని తిడితే, మిగతా నెటిజన్స్ పవన్‌నే టార్గెట్ చేసుకున్నారు. ఇలా ఆగష్టు నెలంతా చిరు, పవన్‌ల మీద ట్రోలింగ్‌తోనే సరిపోయింది. ఆ లిస్ట్‌లోకి కొత్తగా వరుణ్ తేజ్ వచ్చాడు. తన స్టోరీ సెలక్షన్ మీద ట్రోలింగ్ భారీగా జరుగుతోంది. గాండీవధారి అర్జున డిజాస్టర్లకే డిజాస్టర్ అంటున్నారు. రెండు రోజుల వసూళ్లతో అట్టర్ ఫ్లాప్ అని తేల్చారు విశ్లేషకులు. ఇక అఖిల్ ఏజెంట్ తర్వాత వరుణ్ గాండీవధారి అర్జున ఫ్లాప్‌తో ఈ రెండు సినిమాల్లో నటించిన సాక్షి వైద్య పనైపోయింది. ఐరన్ లెగ్‌గా స్టాంప్ పడిపోయింది. తన సంగతి అటుంచితే ఆగస్ట్ నెల మెగా జోరుతో అదుర్స్ అనిపిస్తారనుకుంటే, మెగా ఫ్యాన్స్ బెదుర్స్ అనేలా చేశాయి చిరు, పవన్, వరుణ్ సినిమాలు.
జులై ఎండింగ్‌లో బ్రో, ఆగస్ట్‌లో చిరు, వరుణ్ తేజ్ సినిమాలు వచ్చాయి. ఇక ఆదికేశవ్ అంటూ వైష్ణవ్ తేజ్ మూవీ కూడా ఈనెల్లోనే రావాలి. కాని, వాయిదా వేయటంతో వైష్ణవ్ తేజ్ బతికిపోయాడు. ఆమూవీ ఎలా ఉన్నా, వరుసగా మెగా ప్లాపులు వస్తుండటం, ట్రోలింగ్ పెరుగుతుండటంతో ఆ కామెంట్ల ఎఫెక్ట్ ఆదికేశవ మీద పడి, సినిమాకు పంచ్ పడేదనే అభిప్రాయముంది.