Mega family : పవన్ కళ్యాణ్ కోసం చిరంజీవి, రామ్ చరణ్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన జనసేనా (Jana Sena) ని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు సపోర్ట్ గా మెగా ఫ్యామిలీ (Mega Family) మొత్తం రంగంలోకి దిగింది.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన జనసేనా (Jana Sena) ని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు సపోర్ట్ గా మెగా ఫ్యామిలీ (Mega Family) మొత్తం రంగంలోకి దిగింది. ఇప్పటికే వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజ్ పిఠాపురంలో పవన్ తరపున ప్రచారం చేశారు. తాజాగా పవన్ కి మద్దతుగా చిరంజీవి ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ (Ram Charan) కూడా సోషల్ మీడియా వేదికగా తన మద్దతు తెలిపాడు.
తన గురించి కంటే, జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలి అనుకుంటారు. కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనను ఎందరికో సాయం చేశాడు. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ళ వల్లే ప్రజాస్వామ్యానికి మరింత నష్టమని నమ్మి, జనం కోసం జనసైనికుడు అయ్యాడు. చట్టసభల్లో కళ్యాణ్ లాంటి నాయకుడి గొంతు మనం వినాలి. జనమే జయం అని నమ్మే జనసేనాని ని గెలిపించండి. అంటూ చిరంజీవి ఓ స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు.
పవన్ కి మద్దతుగా చిరంజీవి మాట్లాడిన వీడియోని తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన రామ్ చరణ్.. మీ భవిష్యత్తు కోసం పాటుపడే నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి.” అని రాసుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ కోసం మెగా ఫ్యామిలీ మొత్తం రంగంలోకి దిగడం చూసి అభిమానులుసంబరపడుతున్నారుఫ్యామిలీ బాండింగ్ అంటే ఇలా ఉండాలని కామెంట్లు పెడుతున్నారు.