లండన్ లో చిరంజీవికి చేదు అనుభవం.. కోపంతో ఊగిపోయిన మెగాస్టార్..!

చిరంజీవి ప్రస్తుతం లండన్ లో ఉన్నారు. అక్కడి హౌస్ ఆఫ్ కామన్స్- యూకే పార్లమెంటులో ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయిప్పుడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 22, 2025 | 11:41 AMLast Updated on: Mar 22, 2025 | 11:41 AM

Chiranjeevi Had A Bitter Experience In London

చిరంజీవి ప్రస్తుతం లండన్ లో ఉన్నారు. అక్కడి హౌస్ ఆఫ్ కామన్స్- యూకే పార్లమెంటులో ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయిప్పుడు. తనపై ఇంత ప్రేమ చూపించాలా చేసిన కళామతల్లికి ఎటు జన్మలెత్తిన రుణం తీర్చుకోలేని అని చెప్పారు మెగాస్టార్. అంతా ఆనందంగా వెళుతున్న ఈ లండన్ టూర్ లో ఒక చేదు అనుభవం చిరంజీవిని బాగా డిస్టర్బ్ చేసింది. యూకే వచ్చిన తనను కలవడానికి కొందరు తమ స్వలాభం కోసం అభిమానుల నుంచి డబ్బులు దోచుకుంటున్నారు అనే విషయం చిరంజీవి దృష్టికి వచ్చింది. చిరంజీవిని కల్పిస్తాము.. ఫ్యాన్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తాం.. మీరు చిరంజీవితో కలిసి ఫోటోలు దిగొచ్చు.. భోజనం చేయొచ్చు అంటూ కొందరు తమ స్వలాభం కోసం అభిమానాన్ని క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు.

దేశం కానీ దేశంలో కూడా ఇలాంటి దారుణమైన పనులు చేస్తూనే ఉన్నారు. ఇది ఆ నోట ఈ నోట తిరిగి చివరికి చిరంజీవి చెవిన పడింది. దాంతో వెంటనే రియాక్ట్ అయ్యాడు మెగాస్టార్. తన పేరు మీద అలా డబ్బులు వసూలు చేస్తున్న వాళ్ళపై సీరియస్ అయ్యారు.. అంతేకాదు ఫ్యాన్ మీటింగ్స్ పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితే అసలు ఇవ్వద్దు అంటూ అభిమానులను ఉద్దేశిస్తూ ఒక లేఖ విడుదల చేశాడు చిరంజీవి. మీ అభిమానాన్ని డబ్బుతో వెల కట్టలేము.. అది నాకు మీకు మధ్య ఉన్న రక్తసంబంధం కంటే గొప్పది.. దయచేసి ఫ్యాన్ మీటింగ్స్ పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితే అసలు ఇవ్వద్దు అంటూ చెప్పుకొచ్చాడు మెగాస్టార్. అలాంటి పనులు చేయడం నేను అస్సలు సహించను అంటూ లెటర్లో రాశారు చిరు. ఇప్పటివరకు ఎవరైనా ఫ్యాన్ మీటింగ్స్ పేరుతో డబ్బులు వసూలు చేస్తే ఖచ్చితంగా అవి వాళ్లకు వెంటనే తిరిగి ఇచ్చేయండి.. లేదంటే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి.. ఇలాంటివి నేను అసలు సహించను అంటూ వార్నింగ్ ఇచ్చాడు మెగాస్టార్.

మీకు నాకు మధ్య ఉన్న ఈ వెలకట్టలేని అభిమానిని కొనగలిగే డబ్బు ఈ లోకంలో లేదు.. నేనే నీ దగ్గరికి వస్తాను.. మీరు నన్ను చూడడానికి డబ్బులు ఖర్చు పెట్టొద్దు అంటూ చిరంజీవి చెప్పుకొచ్చాడు. ఈ లెటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చిరంజీవి లండన్ టూర్ ను తమ స్వలాభం కోసం వాడుకోవడానికి కొంతమంది ఇలా చేశారు. ఏదేమైనా ఒక గౌరవం అందుకోవాలని చిరంజీవి యూకే వెళితే.. దాన్ని కూడా బిజినెస్ చేయాలనుకున్నారు కొందరు. అది నిజంగా తనకు బాధ కలిగించింది అంటున్నారు చిరంజీవి. ఇదే వారంలో ఆయన ఇండియా రానున్నారు. వచ్చిన వెంటనే తన సినిమా పనులతో బిజీ కానున్నారు మెగాస్టార్.