Vishwambhara : పురాణాల్ని ఢీకొడుతున్న చిరంజీవి..
తెలుగు ప్రేక్షకులని సుమారు నాలుగు దశాబ్దాలుగా తన నటనతో డాన్సులతో ఫైట్స్ లతో మెస్మరైజ్ చేస్తున్న నటుడు పద్మవిభూషణ్ చిరంజీవి. ఆయన సినిమా వస్తుందంటే చాలు థియేటర్ల దగ్గర రెండు రోజుల నుంచే పండగ వాతావరణం నెలకొని ఉంటుంది. అసలు ఆయన కొత్త సినిమా స్టార్ట్ అయ్యిందంటేనే ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. తాజాగా ఆయనకి సంబంధించిన ఒక న్యూస్ ఫ్యాన్స్ ని ఆనందంలో ముంచెత్తుతుంది.

Chiranjeevi is clashing legends with Bimbisara fame director and Vishwambhara.
తెలుగు ప్రేక్షకులని సుమారు నాలుగు దశాబ్దాలుగా తన నటనతో డాన్సులతో ఫైట్స్ లతో మెస్మరైజ్ చేస్తున్న నటుడు పద్మవిభూషణ్ చిరంజీవి. ఆయన సినిమా వస్తుందంటే చాలు థియేటర్ల దగ్గర రెండు రోజుల నుంచే పండగ వాతావరణం నెలకొని ఉంటుంది. అసలు ఆయన కొత్త సినిమా స్టార్ట్ అయ్యిందంటేనే ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. తాజాగా ఆయనకి సంబంధించిన ఒక న్యూస్ ఫ్యాన్స్ ని ఆనందంలో ముంచెత్తుతుంది.
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర(Vishwambhara). ఇప్పుడు ఈ చిత్రం యొక్క షూటింగ్ లో చిరంజీవి పాల్గొనబోతున్నాడు.ఈ విషయాన్ని చిరు స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియచేసాడు.విశ్వంభర టైటిల్ తో కూడిన ఒక పోస్టర్ ని టాగ్ చేసిన మరి చిరు ఈ విషయాన్ని తెలిపాడు.ఒక అధ్బుతమైన లోకంలో నుంచి చిరు నడుచుకుంటు వస్తున్న ఆ పోస్టర్ సూపర్ గా ఉంది. కాకపోతే చిరంజీవి షాడో ని మేకర్స్ చూపించారు. ఇప్పుడు ఆ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చిరు ఫ్యాన్స్ అయితే సంబరాల్లో మునిగిపోయారు.జనవరి 10 న విశ్వంభర విశ్వవ్యాప్తంగా విడుదల కాబోతుందనే విషయాన్ని కూడా పోస్టర్ లో తెలియచేసారు.అలాగే పోస్టర్ లో పురాణాలు ఢీకొన్నప్పుడు ఇతిహాసాలు పెరుగుతాయి అనే క్యాప్షన్ కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉంది.
బింబిసార (Bimbisara) ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో వస్తున్న ఈ విశ్వంభర కి ఎంఎం కీరవాణి ( MM Keeravani) సంగీతాన్ని అందిస్తుండగా చంద్రబోస్ సాహిత్యరచన చేస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ పతాకంపై ఉప్పలపాటి ప్రమోద్, వంశీ లు నిర్మిస్తుండగా చోటా.కె నాయుడు కెమెరా బాధ్యతలని నిర్వహిస్తున్నాడు. చిరుతో జత కట్టే హీరోయిన్లతో పాటు ఇతర నటీనటుల వివరాలు కూడా త్వరలోనే వెల్లడి కానున్నాయి.