అనిల్ రావిపూడి కోసం 25 ఏళ్ల తర్వాత ఆ పని చేయబోతున్న చిరంజీవి..!
అనిల్ రావిపూడి సినిమా కోసం అభిమానులు మాత్రమే కాదు చిరంజీవి కూడా ఆసక్తిగా వేచి చూస్తున్నాడు. ఎప్పుడెప్పుడు ఆయన షూటింగ్ మొదలుపెడదామని వెయిట్ చేస్తున్నాడు మెగాస్టార్.

అనిల్ రావిపూడి సినిమా కోసం అభిమానులు మాత్రమే కాదు చిరంజీవి కూడా ఆసక్తిగా వేచి చూస్తున్నాడు. ఎప్పుడెప్పుడు ఆయన షూటింగ్ మొదలుపెడదామని వెయిట్ చేస్తున్నాడు మెగాస్టార్. దానికి కారణం కూడా లేకపోలేదు.. ఈ మధ్య కాలంలో సీరియస్ సినిమాలు ఎక్కువగా చూస్తున్న చిరంజీవి.. తనను తాను కొత్తగా చూసుకోవాలి అనుకుంటున్నాడు. ముఖ్యంగా అభిమానులు ఒకప్పుడు తనను ఎలా చూశారో అలాంటి సినిమా చేయాలని చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాడు చిరంజీవి. కానీ అలాంటి కథ ఏ దర్శకుడు ఆయన దగ్గరికి తీసుకురావడం లేదు. మధ్యలో వాల్తేరు వీరయ్యలో బాబీ కాసేపు అలా వింటేజ్ మెగాస్టార్ ను చూపించాడు కానీ పూర్తిస్థాయిలో మాత్రం కాదు. అందుకే ఇప్పుడు చేయబోయే సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉండాలని ఫిక్స్ అయిపోయాడు మెగాస్టార్. ఇండస్ట్రీలో ఇప్పుడు అలాంటి డైరెక్టర్ ఎవరున్నారు అని అడిగితే చిన్నపిల్లలు కూడా చెప్పే సమాధానం అనిల్ రావిపూడి.
అందుకే ఆయన సినిమా మొదలు పెట్టాలని అంతగా వేచి చూస్తున్నాడు చిరంజీవి. కేవలం ఆరు నెలల్లోనే ఈ సినిమా విడుదల కానుంది. సంక్రాంతి 2026 మాదే అంటూ ఇప్పటికే అనౌన్స్మెంట్ వీడియో కూడా చేశాడు అనిల్ రావిపూడి. ఇక ఈ సినిమా కోసం చిరంజీవి పాతికేళ్ల తర్వాత ఒక పని చేయబోతున్నాడు. ఇన్ని సంవత్సరాలలో ఏ దర్శకుడు కూడా చిరంజీవితో అలా చేయించాలని అనుకోలేదు. అప్పట్లో మృగరాజు.. దానికి ముందు ఒకసారి మాస్టర్ సినిమాలో చేసిన ఫీట్ ఇప్పుడు మళ్లీ అనిల్ రావిపూడి కోసం చేయబోతున్నాడు చిరంజీవి. అదేంటో ఈపాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది.. ఎస్ అనిల్ సినిమా కోసం చిరంజీవి పాట పాడబోతున్నాడని తెలుస్తుంది. మాస్టర్ సినిమాలో తమ్ముడు తమ్ముడు ఈ తికమక దిగులే ప్రేమంటే అంటూ.. అదరగొట్టాడు చిరంజీవి. ఆ తర్వాత మృగరాజు సినిమాలో ఏ చాయ్ చటుక్కున తాగరా బాయ్ అంటూ చాయ్ గొప్పతనం చెప్పే ఒక పాట పాడాడు. అంతే ఆ తర్వాత మళ్లీ ఇప్పటివరకు తన గాత్రం సవరించలేదు మెగాస్టార్. నిజం చెప్పాలంటే అవసరం ఎప్పుడు రాలేదు. కానీ ఇన్నేళ్ల తర్వాత తన సినిమాలో చిరంజీవితో పాట పాడించాలని ఫిక్స్ అయిపోయాడు అనిల్ రావిపూడి.
మొన్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ తో అదిరిపోయే బ్లాక్ బస్టర్ సాంగ్ పాడించాడు అనిల్. సినిమాకు ఆ పాట బాగా హెల్ప్ అయింది. ఇప్పుడు సేమ్ సీన్ చిరంజీవితో కూడా రిపీట్ చేయాలని చూస్తున్నాడు ఈ దర్శకుడు. భీమ్స్ కూడా చిరు కోసం అదిరిపోయే ట్యూన్ రెడీ చేస్తున్నాడు. షూటింగ్ వదలవడానికి కనీసం ఇంకో 45 రోజులైనా పడుతుంది. అందుకే ఈలోపు మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టి.. పాటలు పూర్తి చేయాలని చూస్తున్నాడు అనిల్. మెగాస్టార్ ఇమేజ్ కు సరిపోయి పక్కా కమర్షియల్ మాస్ బీట్స్ ఇస్తున్నాడు భీమ్స్. వీలైనంత తక్కువ బడ్జెట్లో ఈ సినిమాను పూర్తి చేయాలి అనేది అనిల్ రావిపూడి ప్లాన్. మరోవైపు చిరంజీవి కూడా ఈ సినిమాకు రెమ్యూనరేషన్ కాకుండా షేర్ తీసుకుంటున్నాడని తెలుస్తుంది. మొత్తానికి చాలా హంగులతో ఈ సినిమా రెడీ అవుతుంది. మరి రాబోయే సంక్రాంతికి మెగా సందడి ఎలా ఉండబోతుందో చూడాలి.