Chiranjeevi: చిరు బ్రోడాడీ రీమేక్ చేయట్లేదా..? సినిమా రీమేక్ చేసేదెవరు..?
కొన్నాళ్లుగా రీమేక్ డిస్కషన్స్‌లో ఉన్న మళయాళ మూవీ బ్రో డాడీ. ఈ చిత్రం హక్కులు దక్కించుకున్నప్పటికీ.. తెలుగు మేకర్స్ ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్‌లో తెరకెక్కిన మూవీ బ్రోడాడి.

Megastar Chiranjeevi is all set for knee surgery.
Chiranjeevi: మళయాళంలో సెట్ అయినట్టుగా కథలు, కాంబినేషన్‌లు ఇతర భాషల్లో సెట్ కావు. ఎంత కంటెంట్ ఉన్న సినిమాలైనా సరే మిగతా భాషల్లోకి వచ్చే సరికి కమర్షియల్ హంగులు అద్ది తీరాల్సిందే. కానీ కొన్నాళ్లుగా రీమేక్ డిస్కషన్స్‌లో ఉన్న మళయాళ మూవీ బ్రో డాడీ. ఈ చిత్రం హక్కులు దక్కించుకున్నప్పటికీ.. తెలుగు మేకర్స్ ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్‌లో తెరకెక్కిన మూవీ బ్రోడాడి.
ఇందులో మోహన్ లాల్, పృధ్వి రాజ్ తండ్రి కొడుకులుగా కలిసి నటించారు. 2022 జనవరిలో రిలీజైన ఈ మూవీ మలయాళ ఆడియన్స్‌ని విశేషంగా ఆకట్టుకుంది. సినిమాలో మోహన్ లాల్, పృధ్వి రాజ్ మధ్య వచ్చే సీన్స్ బాగా వర్క్ అవుట్ అయ్యాయి. అందుకే ఈ ప్రాజెక్ట్‌ని తెలుగులో రీమేక్ చేయాలని చాన్నాళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఇప్పటివరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు. చిరంజీవి హీరోగా సుస్మిత ప్రొడక్షన్‌లో ఈ ప్రాజెక్ట్ రీమేక్ కాబోతున్నట్లు గతంలో ప్రచారం జరిగింది. కానీ అది నిజం కాదని తెలిపోయింది. బ్రో డాడీ తెలుగు నేటివిటీకి తగినట్టుగా మంచి కాంబినేషన్ సెట్ చేస్తే తప్పకుండా వర్క్ అవుట్ అవుతుంది. ఇదే కాదు పృధ్వి రాజ్ సుకుమారన్ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ సినిమా కూడా తెలుగు రీమేక్ డిస్కషన్స్ దగ్గరే ఆగిపోయింది.
అయితే ఈమధ్య రీమేక్ సినిమాల కన్నా ఒరిజినల్ కథలకే ఎక్కువ ప్రయారిటి ఇస్తున్నారు ప్రేక్షకులు. ఈ కారణంగానే బ్రో డాడీ మూవీని రీమేక్ చేసేందుకు ఎవరూ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. మరి రీమేక్ రైట్స్ కొన్న నిర్మాతలు ఈ విషయంలో ఏం చేస్తారో చూడాలి.