సీఎం గారు ఇదిగో నా కొడుకు చెక్, రేవంత్ ఇంటికి చిరంజీవి
రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున వరదలు ప్రజలకు చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో సినిమా పరిశ్రమ పెద్ద ఎత్తున తరలి వచ్చి రెండు రాష్ట్రాలకు తమ వంతు సాయం చేసింది. పెద్ద పెద్ద స్టార్ హీరోల నుంచి చిన్న హీరోలు, నటుల వరకు అందరూ సాయం చేసారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున వరదలు ప్రజలకు చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో సినిమా పరిశ్రమ పెద్ద ఎత్తున తరలి వచ్చి రెండు రాష్ట్రాలకు తమ వంతు సాయం చేసింది. పెద్ద పెద్ద స్టార్ హీరోల నుంచి చిన్న హీరోలు, నటుల వరకు అందరూ సాయం చేసారు. ముఖ్యంగా మెగా నందమూరి కుటుంబాలు పెద్ద ఎత్తున సాయం చేసాయి. మెగా కుటుంబం ఏకంగా 9 కోట్ల వరకు సాయం చేసి ఆదర్శంగా నిలిచింది. అటు ఏపీకి ఇటు తెలంగాణాకు సమానంగా సాయం చేసారు మెగా హీరోలు అందరూ.
ఆంధ్రప్రదేశ్ కు ప్రకటించిన విరాళాన్ని రామ్ చరణ్… డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ అందించగా నేడు మెగాస్టార్ చిరంజీవి… తెలంగాణా సిఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి సహాయనిధికి తాము ప్రకటించిన సాయాన్ని ప్రముఖులు నేడు హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లో కలిసి చెక్ లు ఇచ్చారు. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 50 లక్షలు విరాళం అందజేసిన మెగాస్టార్ చిరంజీవి… రామ్ చరణ్ తరపున మరో 50 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు.
రామ్ చరణ్ వేరే కారణాలతో రాలేకపోయాడని అందుకే చరణ్ తరుపున తాను చెక్ ఇస్తున్నా అంటూ రేవంత్ రెడ్డితో అన్నారు చిరంజీవి. రెండు చెక్కులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించారు. ఇక అమర్ రాజా గ్రూప్ తరపున సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం మాజీ మంత్రి గల్లా అరుణకుమారి అందించారు. అలాగే సినీ నటుడు అలీ కూడా తన వంతు సాయం చేసారు. రేవంత్ రెడ్డికి మూడు లక్షల చెక్ ఇచ్చారు. వారితో పాటుగా ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.10లక్షలు విరాళంగా అందించాడు యువ హీరో విశ్వక్ సేన్. జూబిహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్ లను అందించారు. ఇటీవల నందమూరి కుటుంబం తరుపున నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె రేవంత్ రెడ్డికి చెక్ లు ఇచ్చారు.