CHIRANJEEVI: సారీ అన్నయ్య.. నాతో చిరంజీవిని తిట్టించింది వాళ్లే.. నిజం చెప్పిన రైటర్ చిన్నికృష్ణ
చిరంజీవిపై నెగటివ్ కామెంట్స్ చేసినందుకు మెగాస్టార్‌కు క్షమాపణ చెప్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. చిరంజీవి కెరీర్‌లో బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన చిత్రం ఇంద్ర. ఈ సినిమాకు స్టోరీ రాసింది రైటర్ చిన్నికృష్ణ.
CHIRANJEEVI: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్స్ ఉన్నా మెగాస్టార్‌కు ఉండే స్థానం వేరు. ఆయన స్థాయి వేరు. సినిమాల్లో యాక్టింగ్ పరంగానే కాదు.. వ్యక్తిగత జీవితంలో కూడా మెగాస్టార్ ఎంత ఉన్నతంగా ఆలోచిస్తారో ఆయనను దగ్గరగా చూసే చాలా మందికి తెలుసు. తనకు చెడు చేసినవారికి కూడా మంచి చేసే మనస్తత్వం చిరంజీవిది అని చాలా మంది చెప్తూ ఉంటారు. అంత మంచి వ్యక్తి కాబట్టే కోట్ల మంది అభిమానులను సంపాదించుకోగలిగారు. ఈ విషయాన్ని రైటర్ చిన్న కృష్ణ చాలా లేట్‌గా అర్థం చేసుకున్నారు అనుకుంటా.
REVANTH REDDY: గ్రూప్ 1, 2.. ఎక్కడ రేవంత్ సార్.. ఆడుకుంటున్న నిరుద్యోగులు..
చిరంజీవిపై నెగటివ్ కామెంట్స్ చేసినందుకు మెగాస్టార్‌కు క్షమాపణ చెప్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. చిరంజీవి కెరీర్‌లో బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన చిత్రం ఇంద్ర. ఈ సినిమాకు స్టోరీ రాసింది రైటర్ చిన్నికృష్ణ. అయితే ఈ సినిమా తర్వాత చిరంజీవిపై చిన్ని కృష్ణ పలు విమర్శలు చేశారు. ఇంద్ర వంటి హిట్ చిత్రాన్ని అందిస్తే కనీసం తనను ఇంటికి పిలిచి భోజనం కూడా పెట్టలేదంటూ గతంలో ఆరోపణలు చేశారు. అప్పట్లో చిన్నికృష్ణ కామెంట్స్ మెగాఫ్యాన్స్‌ను తీవ్ర ఆగ్రహానికి గురి చేశాయి. అయితే అప్పుడు చేసిన తప్పుకు ఇప్పుడు సారీ చెప్పాడు చిన్నికృష్ణ. చిరంజీవికి పద్మవిభూషన్ అవార్డ్ వచ్చిన సందర్భంగా తాను చిరంజీవిని కలిశానని.. చిరంజీవి తనను రిసీవ్ చేసుకున్న తీరు తనకు ఎంతో సంతోషంగా అనిపించిందంటూ వీడియో రిలీజ్ చేశాడు. గతంలో జరిగిన విషయాన్ని మనసులో పెట్టుకోకుండా తన భార్యా పిల్లల గురించి కూడా ఆయన అడిగి తెలుసుకున్నారంటూ వీడియోలో చెప్పాడు చిన్నికృష్ణ. మెగాస్టార్ మాటలు విన్న తరువాత.. ఇలాంటి వ్యక్తి గురించా నేను తప్పుగా మాట్లాడింది అని చిన్నికృష్ణ చాలా బాధపడ్డారట.
వెంటనే అప్పుడు అలా మాట్లాడినందుకు సారీ అన్నయ్య అంటూ మెగాస్టార్‌కు సారీ చెప్పారట. వెంటనే చిరంజీవి చిన్నిని దగ్గరకు తీసుకుని చాలా ప్రేమగా మాట్లాడారట. మంచి కథలేవైనా రాస్తే చెప్పు కలిసి పనిచేద్ధా అంటూ చెప్పారట. చిరంజీవి చూపించిన ప్రేమకు ఫిదా ఐపోడాడు చిన్నికృష్ణ. జీవితంలో ఇంకోసారి మెగాస్టార్ గురించి తప్పుగా మాట్లాడబోనంటూ వీడియో పోస్ట్ చేశాడు. ఈసారి చిరంజీవి కోసం తాను రాసే కథ భారత చరిత్రలో నిలిచిపోయేలా ఉంటుందని.. ఇలాంటి అవార్డులు చిరంజీవికి మరెన్నో రావాలంటూ చెప్పాడు. చిన్నికృష్ణ పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు అంటూ మెగాస్టార్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఇదీ మెగాస్టార్ అంటే అంటూ గల్లా ఎగరేస్తున్నారు. ఏది ఏమైనా.. తనను తిట్టిన వ్యక్తిని కూడా ప్రేమగా పలకరించి తానేంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు మెగాస్టార్.