చిరంజీవి అందుకే రాలేదు, రేవంత్ తో భేటీకి దూరం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ పరిశ్రమ పెద్దలు కాసేపటి క్రితం భేటీ అయ్యారు. కమాండ్ కంట్రోల్ రూమ్ లో ముఖ్యమంత్రితో సినిమా ప్రముఖులు మీటింగ్ స్టార్ట్ అయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 26, 2024 | 12:11 PMLast Updated on: Dec 26, 2024 | 12:11 PM

Chiranjeevi Missing For Meeting With Chiranjeevi

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ పరిశ్రమ పెద్దలు కాసేపటి క్రితం భేటీ అయ్యారు. కమాండ్ కంట్రోల్ రూమ్ లో ముఖ్యమంత్రితో సినిమా ప్రముఖులు మీటింగ్ స్టార్ట్ అయింది. ఈ భేటీకి ప్రముఖ నిర్మాతలు అలాగే ప్రముఖ హీరోలు హాజరయ్యారు. నిర్మాతల నుంచి… సురేష్ బాబు, కేఎల్ నారాయణ, అల్లు అరవింద్, దానయ్య, మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఎలమంచిలి రవిశంకర్… అలాగే సీతారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ సహ మొత్తం 21 మంది నిర్మాతలు హాజరయ్యారు. ఇక దర్శకుల్లో అనిల్ రావిపూడి, కొరటాల శివ, రాఘవేంద్రరావు, ప్రశాంత్ వర్మ సహా 13 మంది దర్శకులు హాజరయ్యారు.

ఇక నటుల నుంచి అక్కినేని నాగార్జున, వరుణ్ తేజ్, సాయి ధరం తేజ్, అడివి శేష్, కిరణ్ అబ్బవరం, వెంకటేష్, జొన్నలగడ్డ సిద్దు సహా 11 మంది హాజరయ్యారు. అయితే ఈ భేటీకి మెగాస్టార్ చిరంజీవి మాత్రం హాజరు కాలేదు. ఇండస్ట్రీ పెద్దగా ప్రతి సందర్భంలో కనిపించే మెగాస్టార్ చిరంజీవి ముఖ్యమంత్రితో జరిగిన సమావేశానికి మాత్రం దూరంగా ఉన్నారు. గతంలో జగన్ తో మీటింగ్ కి స్వయంగా సారధ్య వహించిన చిరంజీవి ఇప్పుడు రేవంత్ తో మీటింగ్ కి దూరంగా ఉండటం పట్ల అసలు ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.

ఇప్పుడు ముఖ్యమంత్రి పెట్టే మీటింగ్ కీలకం కాబట్టి.. సినిమా పరిశ్రమకు గడ్డు పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో ఇండస్ట్రీ పెద్దగా… చిరంజీవి హాజరు కావాల్సింది. కానీ ఆయన మాత్రం దూరంగా ఉన్నరు. ఆయన దూరంగా ఉండటం వెనక కారణం ఏంటి అనేదానిపై పెద్ద చర్చ జరుగుతుంది. అల్లు అర్జున్ ప్రస్తావన వస్తే మాట్లాడాల్సి వస్తుందని… అల్లు అర్జున్ చేసిన పనికి క్షమాపణ చెప్పాల్సి వస్తుందని అందుకే సమావేశానికి వ్యూహాత్మకంగా చిరంజీవి దూరంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ సమావేశానికి ప్రముఖ నిర్మాత తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు సారధ్య ఊహిస్తున్నారు.

ఈ తరుణంలో చిరంజీవి దూరంగా ఉండటం తో అటు ప్రభుత్వ వర్గాలు కూడా కాస్త షాక్ అయ్యాయి. త్వరలో చిరంజీవి సినిమా అలాగే రామ్ చరణ్ సినిమా కూడా రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. బెనిఫిట్ షోలో విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. టికెట్ ధరలు పెంచే అవకాశం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే శాసనసభలో ప్రకటన కూడా చేశారు. ఇలాంటి తరుణంలో ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి హాజరు కావాల్సి ఉంది. కానీ ఆయన మాత్రం దూరంగా ఉన్నారు. అటు నందమూరి బాలకృష్ణ కూడా ఈ సమావేశానికి దూరంగానే ఉన్నారు. అయితే ఈ భేటీకి ప్రభాస్ కూడా వస్తారని ముందు ప్రచారం జరిగింది. కానీ ప్రభాస్ మాత్రం హాజరయ్యే ప్రయత్నం చేయలేదు.