నా బిడ్డ కష్టాలు వింటే ఏడుస్తారు.. తొలిసారి శ్రీజ విడాకులపై స్పందించిన చిరంజీవి..!
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుందిప్పుడు. ఆ ఇంటర్వ్యూలో చాలా విషయాల గురించి మాట్లాడాడు మెగాస్టార్.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుందిప్పుడు. ఆ ఇంటర్వ్యూలో చాలా విషయాల గురించి మాట్లాడాడు మెగాస్టార్. తన చిన్నతనం గురించి.. కుటుంబం గురించి.. నాన్న గురించి.. బాల్యంలో ఎదుర్కొన్న కష్టాల గురించి.. తన చెల్లి మరణం గురించి ఇలా ఒకటి కాదు ఒకే ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు ఆడియన్స్ కు చెప్పాడు చిరంజీవి. తన ఇద్దరు చెల్లెల్లు, అమ్మ అంజనమ్మ, తమ్ముడు నాగబాబుతో ఈ ఇంటర్వ్యూ చేశాడు చిరంజీవి. ఇందులో అన్నింటికంటే ప్రధానంగా చిన్న కూతురు శ్రీజ గురించి చెప్పిన విషయాలు బాగా హైలైట్ అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు చిన్న కూతురు విడాకుల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు చిరంజీవి.
గతంలో ఒకసారి ఒక ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ అడిగితే చాలా సీరియస్ అయ్యాడు మెగాస్టార్. 2007లో కేవలం 19 సంవత్సరాల వయసులో తను ప్రేమించిన శిరీష్ భరద్వాజ్ ను ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకుంది శ్రీజ. ఆ తర్వాత తన కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణహాని ఉంది ఎందుకు పోలీసులను కూడా ఆశ్రయించింది. అప్పట్లో నేషనల్ వైడ్ గా ఈ టాపిక్ బాగా హైలైట్ అయింది. కానీ కొన్ని రోజులకే వైవాహిక జీవితంలో సమస్యలు రావడంతో శిరీష్ తో విడిపోయి మళ్ళీ చిరంజీవి దగ్గరికి వచ్చేసింది. అలా వచ్చిన కూతురిని కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు చిరంజీవి. ఐదేళ్ల తర్వాత కళ్యాణ్ దేవ్ తో ఘనంగా శ్రీజ వివాహం జరిపించాడు. కానీ ఈ పెళ్లి కూడా మూడేళ్ల నుంచి నిలబడలేకపోయింది. తన కూతురు జీవితంలో రెండుసార్లు విడాకుల పర్వం జరగడంతో దాని గురించి ఇప్పుడు ఓపెన్ అయ్యారు చిరంజీవి. లేటెస్ట్ ఇంటర్వ్యూలో శ్రీజ ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పాడు మెగాస్టార్.
శ్రీజ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొందని.. ఆ టైంలో శ్రీజ నానమ్మ దగ్గర సలహాలు తీసుకుందని.. నానమ్మ మాటలు వింటే ఎంతో పాజిటివ్ గా అనిపిస్తుందని శ్రీజ చెప్పిందని చెప్పుకొచ్చాడు చిరంజీవి. ఎవడో ఒకడి వల్ల నీ జీవితం ఆగిపోకూడదు.. నీవు అనుకున్నది చేయాలి.. జీవితంలో ముందుకు సాగాలని నానమ్మ అంజనమ్మ శ్రీజకు ఇచ్చిన సలహాల గురించి చిరంజీవి గుర్తు చేసుకున్నాడు. శ్రీజ తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను తలుచుకుంటూ అప్పుడప్పుడు కన్నీళ్లు వస్తాయి అని చెప్పాడు చిరంజీవి. ప్రస్తుతం శ్రీజ తన స్నేహితులతో కలసి సీసా స్పేసెస్ సెంటర్ అనే స్కూల్ ని ప్రారంభించింది. శ్రీజకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు అమ్మ దగ్గరే ఉన్నారు.