ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వ్యవహారంలో మెగా ఫ్యామిలీ ఇప్పుడు చాలా సీరియస్ గా ఉన్న సంగతి స్పష్టంగా అర్థం అవుతుంది. సంధ్య థియేటర్ ఘటన తర్వాత మెగా ఫ్యామిలీలో గ్యాప్ మరింత పెరిగింది అనే వార్తలు కూడా వచ్చాయి. అల్లు అర్జున్... మెగా ఫ్యామిలీ హీరోల ఇళ్లకు వెళ్లినా పరిస్థితి అంతగా సద్దుమణిగినట్టు ఏమీ కనపడలేదని చెప్పాలి. ప్రస్తుతం అల్లు అర్జున్ ను మెగా ఫ్యామిలీ దూరంగానే ఉంచుతుంది. అల్లు అరవింద్ దగ్గర చేసే ప్రయత్నాలు చేసినా సరే ఎక్కడా కూడా ఫలించడం లేదు అనే వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు ఆహా లో ప్రసారమవుతున్న ఆన్ స్టాపబుల్ అనే షో వేదికగా మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లుగా విభేదాలు మళ్ళీ మొదలయ్యాయి అనే కామెంట్స్ వస్తున్నాయి. అల్లు అర్జున్ అంటే కోపం ఉన్నప్పుడు రామ్ చరణ్ తన గేమ్ చేంజర్ సినిమా కోసం అన్ స్టాపబుల్ లో ఎందుకు ప్రచారం చేయాలి అంటూ ఇప్పుడు చర్చ మొదలైందంట ఈ రెండు ఫ్యామిలీల్లో. అయితే నందమూరి బాలకృష్ణ కోసం తాను అన్ స్టాపబుల్ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లాను అని రామ్ చరణ్ చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో చిరంజీవికి ఏమాత్రం ఇష్టం లేదట. కానీ ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో తను ఎటువంటి చార్జి వసూలు చేయనని అల్లు అరవింద్... చిరంజీవికి కూడా స్వయంగా చెప్పారట. మీ ఫ్రీ ప్రమోషన్స్ మాకు ఏమీ వద్దని అల్లు అర్జున్ వ్యవహారాన్ని ముందు చక్కబెట్టుకోవాలని చిరంజీవి చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి మెగా ఫ్యామిలీలో విభేదాలు మొదలైంది రామ్ చరణ్ దగ్గర నుంచి అనేది కొంతమంది వాదన. రామ్ చరణ్ మాత్రమే మెగా ఫ్యామిలీలో స్టార్ హీరో అనే విధంగా వ్యవహరించడం అల్లు అర్జున్ కు నచ్చలేదని అందుకే బయటకు వచ్చే తాను సొంత ఇమేజ్ కోసం ప్రయత్నాలు చేశాడని ప్రచారం జరిగింది. ప్రస్తుతం... అల్లు అర్జున్ కూడా కాస్త ఒత్తిడిలోనే కనబడుతున్నాడు ఇక పుష్ప సినిమా రికార్డులను బ్రేక్ చేయడానికి గేమ్ చేంజర్ సినిమా ద్వారా రామ్ చరణ్ ప్రయత్నాలు మొదలు పెట్టాడు. అమెరికాలో ఇప్పటికే గ్రాండ్ గా ఈవెంట్ ను ప్లాన్ చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా మెగా ఫాన్స్ ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు. త్వరలోనే రాజమండ్రిలో భారీ ఈవెంట్ నిర్వహించేందుకు దిల్ రాజు ప్లాన్ చేశారు. దీనికి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల నాలుగున ఈ కార్యక్రమం రాజమండ్రిలో గ్రాండ్ గా జరగనుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో అల్లు అరవింద్ కూడా తన వంతు సహాయం చేయడానికి రెడీ అవుతున్నారట.[embed]https://www.youtube.com/watch?v=yGUEocS6CB4[/embed]