CHIRANJEEVI-BALAKRISHNA: బాలయ్య సినిమాకి చిరు స్పెషల్ విషెస్
నందమూరి బాలకృష్ణతో ఓ సినిమాను పట్టాలెక్కించాడు. అయితే.. ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి విషెస్ చెప్పడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. బాబీ-బాలయ్య కాంబినేషన్‌లో ఓ మాసివ్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి.
CHIRANJEEVI-BALAKRISHNA: వాల్తేరు వీరయ్య సినిమాతో చిరంజీవికి హిట్ ఇచ్చిన దర్శకుడు బాబి. చిరంజీవి- రవితేజ కాంబోలో, బాబీ డైరెక్షన్‌లో మల్టీ స్టారర్‌గా వచ్చిన ఈ మూవీ భారీ హిట్‌టాక్‌ను సొంతం చేసింది. చిరుతో వాల్తేరు వీరయ్య లాంటి సెన్సేషనల్ హిట్ అనంతరం బాబీ.. మరో అగ్రహీరోతో వర్క చేస్తున్నాడు. నటసింహం నందమూరి బాలకృష్ణతో ఓ సినిమాను పట్టాలెక్కించాడు. అయితే.. ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి విషెస్ చెప్పడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
Mega Star Chiranjeevi: చిరంజీవికి పద్మ విభూషణ్.. మెగా సంబరం..?
బాబీ-బాలయ్య కాంబినేషన్‌లో ఓ మాసివ్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాకు మెగాస్టార్ తన స్పెషల్ విషెస్ తెలియజేసారు అని బాబీ తెలిపాడు. తాను బాలయ్య సినిమా స్టార్ట్ చేసినపుడు చిరు తనకి కాల్ చేసి ఆల్ ది బెస్ట్ తెలిపారని చెప్పాడు. మన సినిమా కంటే బాలయ్య గారితో పెద్ద హిట్ కొట్టాలని చిరు విషెస్ చెప్పారంటూ బాబీ తెలిపాడు. ఇప్పుడు ఈ న్యూస్ కాస్తా సెన్సేషన్‌గా మారింది. బాలయ్య సినిమా విషయంలో చిరు చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. సినిమా ఇండస్ట్రీలో ఏ విభేదాలున్నా.. అంతా తాత్కాలికమేనని, తామంతా ఒక్కటేనని పదే పదే అగ్రహీరోలతో పాటు వారి వారసులు కూడా చెబుతూనే ఉంటారు.
కానీ, ఫ్యాన్స్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ తగువులు పడుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో బాలయ్య మూవీకి చిరు విషెస్ చెప్పడం వైరల్‌గా మారింది. హీరోలందరూ ఒక్కటే.. ఒకరంటే ఒకరికి అభిమానం, గౌరవం ఉంటుందన్న మాటకు ఇదే నిదర్శనమంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు..