Chiranjeevi: భోళా శంకర్ తర్వాత కూడా చిరుకు ఇబ్బందులు తప్పవా..?

సోగ్గాడే చిన్నినాయన లాంటి ఒక్క సూపర్ హిట్ మాత్రమే ఆయన అకౌంట్లో ఉంది. కాని తర్వాత అదే మూవీ సీక్వెల్ బంగార్రాజు యావరేజ్ అనిపించుకుంది. అంతకుముందు రారండోయ్ వేడుక చూద్దాం కూడా ఫర్వాలేదు అనిపించుకుంది. అంతేకాదు కళ్యాణ్ కృష్ణ మాస్ రూట్లో వెళ్లిన ప్రతీ సారి పంచ్ పడింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 16, 2023 | 04:55 PMLast Updated on: Aug 16, 2023 | 4:55 PM

Chiranjeevi Taking Again Risk With Kalyan Krishna Shows His Track Record

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి భోళా శంకర్ ఓ పీడకలలా మారింది. ఇంకా ట్రోలింగ్ జరుగుతోంది. సరే మోకాలి సర్జరీ తర్వాత తను త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్న టైంలో, చిరు రీమేక్స్‌కి నో అన్నాడని అంతా సంతోషించారు. అయినా కాని మెగాస్టార్‌కి ఇబ్బందులు తప్పేలా లేవు. చిరు నెక్ట్స్ మూవీని తీయబోయేది కళ్యాణ్ కృష్ణ. ఈయన ట్రాక్ రికార్డ్ కూడా ఏమంత గొప్పగాలేదు. తను మరీ మోహర్ రమేష్ అంత అధ్వానం కాకున్నా, ఇంచుమించు ఆలిస్ట్‌లో చేరేలానే తన రికార్డుంది.

సోగ్గాడే చిన్నినాయన లాంటి ఒక్క సూపర్ హిట్ మాత్రమే ఆయన అకౌంట్లో ఉంది. కాని తర్వాత అదే మూవీ సీక్వెల్ బంగార్రాజు యావరేజ్ అనిపించుకుంది. అంతకుముందు రారండోయ్ వేడుక చూద్దాం కూడా ఫర్వాలేదు అనిపించుకుంది. అంతేకాదు కళ్యాణ్ కృష్ణ మాస్ రూట్లో వెళ్లిన ప్రతీ సారి పంచ్ పడింది. నేలటిక్కెట్టు, బంగార్రాజు అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇలాంటి ట్రాక్ రికార్డున్న కళ్యాణ్ కృష్ణతో నెక్ట్స్ మూవీ అంటే చిరు మళ్లీ రిస్క్ చేస్తున్నట్టే. సరే చేతిలో బింబిసార లాంటి హిట్ సొంతం చేసుకున్న వశిష్ట మేకింగ్‌లో మూవీ ఉందికదా అనుకుంటే, అక్కడ పంచ్ పడేలా ఉంది.

తొలి మూవీ హిట్టే కాని ద్వితీయ లగ్నం.. అంటే రెండో సినిమా ఫ్లాప్ అవటం అనే సినిమా ఇండస్ట్రీ సెంటిమెంట్‌ని ఈ దర్శకుడు ఎలా దాటేస్తాడు..? అలానే చిరు ఇమేజ్‌కి తగ్గ మూవీ ఎలా రెడీ చేస్తాడు..? ఈ ప్రశ్నలకు ఆన్సర్ లేదు. వీళ్లేదో మిరాకిల్ చేసేలా సినిమా తీస్తే చెప్పలేం కాని, లేకుంటే.. భోళా శంకర్ తర్వాత కూడా చిరుకి ఇబ్బందులు తప్పేలా లేవు.