CHIRANJEEVI VS BALAKRISHNA: బాలయ్య రేంజ్.. చిరంజీవిని మించిపోతుందా..?
చిరంజీవి, బాలకృష్ణ లాంటి సీనియర్ స్టార్లు కూడా ట్రేడ్ పరంగా దూసుకుపోతున్నారు. అయితే, ఒక విషయంలో బాలయ్య రేంజ్ చిరంజీవిని మించిపోయినట్లు కనిపిస్తోంది. అఖండకు ముందు బాలకృష్ణ వేరు, అఖండ తర్వాత వేరు. ఇప్పుడు ఆయన మార్కెట్ బాగా పెరిగింది.

CHIRANJEEVI VS BALAKRISHNA: టాలీవుడ్ హీరోలు ఇప్పుడు తమ స్థాయిని మరో స్థాయికి ఎలివేట్ చేసుకున్నారు. అందరు తారల కోసం వరుస పాన్-ఇండియా సినిమాలు రావడంతో బడ్జెట్‌లు, థియేట్రికల్ రైట్స్, ఫిల్మ్ మేకింగ్‌లో ఉన్న మొత్తం డబ్బు చాలా రెట్లు పెరిగింది. అలాగే చిరంజీవి, బాలకృష్ణ లాంటి సీనియర్ స్టార్లు కూడా ట్రేడ్ పరంగా దూసుకుపోతున్నారు. అయితే, ఒక విషయంలో బాలయ్య రేంజ్ చిరంజీవిని మించిపోయినట్లు కనిపిస్తోంది.
INDIA VS ENGLAND: ఇంగ్లండ్‌తో మిగిలిన టెస్టులకు భారత జట్టు ప్రకటన.. కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ ఔట్..
అఖండకు ముందు బాలకృష్ణ వేరు, అఖండ తర్వాత వేరు. ఇప్పుడు ఆయన మార్కెట్ బాగా పెరిగింది. అఖండ తర్వాత వరుసగా వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుని ఇప్పుడు క్రేజీ చిత్రాలకు సైన్ చేస్తున్నాడు. నిర్మాతలు ప్రస్తుతం బాలకృష్ణ మార్కెట్‌ను ఇష్టపడుతున్నారు. ఎందుకంటే అతని మార్కెట్ మునుపటి కంటే ఇప్పుడు చాలా పెద్దదిగా మారింది. ముఖ్యంగా చిరంజీవితో పోలిస్తే బాలయ్య రెమ్యూనరేషన్ అందుబాటులో ఉంటుంది. శాటిలైట్ పార్టనర్స్‌కి కూడా బాలయ్య సినిమాలు బాగా పనిచేస్తున్నాయి.
భగవంత్ కేసరి 9.36, వీరసింహా రెడ్డి 8.83, అఖండ 13.31 మూడు సినిమాలు తమ టెలివిజన్ ప్రీమియర్‌లలో మంచి TRP రేటింగ్‌లను అందించగా, చిరంజీవి ఇటీవలి చిత్రాలు 5-7 రేటింగ్‌ల మధ్య ఉన్నాయి. దీంతో చిరంజీవి కంటే బాలయ్య కే క్రేజ్ ఎక్కువగా ఉంటుంది అనే వాదన మొదలైంది. అయితే, బాక్సాఫీస్ వద్ద ఎప్పటిలాగే చిరు ముందు వరుసలో ఉన్నారు. కానీ, టెలివిజన్‌పై మాత్రం ఇటీవల బాలయ్య డామినెట్ చేస్తున్నారు.