అన్నయ్య నీకేమైంది?
మనకి వయసు పెరుగుతున్న కొద్ది.... నలుగురికి ఏదో మంచి చెప్పాలని... మనల్ని అందరూ గుర్తించాలనే తపన బాగా పెరుగుతుంది. మెగాస్టార్ చిరంజీవి మాత్రం దానికి అతీతుడు ఏం కాదుగా. ఆయన సంవత్సరానికి ఒకటో రెండో సినిమాలు మాత్రమే చేసిన...

మనకి వయసు పెరుగుతున్న కొద్ది…. నలుగురికి ఏదో మంచి చెప్పాలని… మనల్ని అందరూ గుర్తించాలనే తపన బాగా పెరుగుతుంది. మెగాస్టార్ చిరంజీవి మాత్రం దానికి అతీతుడు ఏం కాదుగా. ఆయన సంవత్సరానికి ఒకటో రెండో సినిమాలు మాత్రమే చేసిన… రోజు ఏదో రకంగా వార్తల్లో ఉంటూనే ఉంటారు. ఆయన వివాదాలు కోరి తెచ్చుకోకపోయినా…. ఆయన మాట్లాడిన తర్వాత అది ఏదో ఒక వివాదం అవుతూనే ఉంటుంది. దానికి చిరు లీక్స్ అని ముద్దుగా అందరం పేరు పెట్టుకున్నప్పటికీ …. ఇండస్ట్రీలో పెద్ద మనిషిగా ఎదిగిన చిరంజీవి అప్పుడప్పుడు నోరు జారి… తన స్థాయిని దిగజార్చుకుంటున్నారా అనే అనుమానం రాక మానదు. అందరివాడు అనిపించుకోవాలనే తాపత్రయంలో అన్నయ్య విపరీతంగా మాట్లాడేసి కొన్నిసార్లు అడ్డంగా దొరికిపోయి, దానిని కవర్ చేయడానికి నానా తంటాలు పడుతుంటారు.
టాలీవుడ్ లో చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా… ఆ మూవీ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కి ముఖ్యఅతిథిగా చిరంజీవి రావాలనే అందరూ కోరుకుంటారు. ఆయన కూడా పిలిచిన వాళ్లందరికీ నో అని చెప్పకుండా ఆ ఫంక్షన్స్ కి వెళ్లి మూవీ టీంని ఆశీర్వదించి వస్తుంటారు.ఇండస్ట్రీకి తానే పెద్ద దిక్కు గా ఉండడం వల్ల…. తాను వెళ్లకపోతే వాళ్ళు ఏమనుకుంటారో అనే భయంతో కచ్చితంగా వెళుతుంటారు చిరు. అక్కడికి వెళ్ళాక ఏదో ఒక వివాదాస్పద కామెంట్ వదలడం… దానిపై రెండు మూడు రోజులు చర్చోపచర్చలు జరుగుతూ ఉంటాయి.తాను చాలా బోల్డ్…. ఏది మనసులో పెట్టుకోడు… అందరితో కలిసిపోతాడు అని అనిపించు కోవాలని అడ్డదిడ్డంగా మాట్లాడేసి బుక్ అయిపోతున్నాడు చిరు. ఫ్రీ రిలీజ్ ఫంక్షన్స్ స్టేజ్ ఎక్కి…. నాతో నటించవా ప్లీజ్ అని హీరోయిన్లను బతిమిలాడుకోవడం… నాతో సినిమా తీయండి అని నిర్మాతల్ని రిక్వెస్ట్ చేయడం…. నాతో సినిమా తీయరా అని డైరెక్టర్స్ ని దేబిరించడం…. ఎందుకో ఫ్యాన్స్ కు మాత్రం అన్నయ్య సహజ నటన అస్సలు నచ్చటం లేదు.
లైలా ఆడియో ఫంక్షన్ కొచ్చి… జై జనసేన అంటూనే… పి ఆర్ పి కి జనసేన ఎక్స్టెన్షన్ అని…. పిఆర్పి రూపాంతరం చెంది జనసేన ఏర్పడిందని … మనసులో మాట బయట పెట్టేసారు చిరు. పి అర్ పి పుట్టుక, వైఫల్యం, విలీనం తెలిసిన జనం అంతా… ఇప్పుడు ఈ మాటలు అవసరమా? అని తల పట్టుకున్నారు.జారిన మాటను వెనక్కి తీసుకోవాలి అంటే…. దానికి కౌంటర్ గా తానే ఏదో ఒకటి మాట్లాడాలి. అందుకే బ్రహ్మా ఆనందం ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో తనకు ఎటువంటి పదవులు వద్దు అని…. అసలు తాను రాజకీయాల్లోకి మళ్ళీ రానని…. రాజకీయాలు పవన్ కళ్యాణ్ చూసుకుంటాడని క్లియర్ కట్ గా చెప్పేసాడు మెగాస్టార్.
ఇక్కడితో కథ అయిపోలేదు. ఏదో సరదాగా నాకు మనవడు కావాలంటూ చిరంజీవి మాట్లాడిన మాట… మీడియాలో ఒక వర్గం విపరీతార్ధాలు తీసి నానా యాగి చేసేసింది.మా తాత రసికుడు అంటూ చిరు పేల్చిన మరో బాంబు…. సోషల్ మీడియాలో అటు తిరిగి ఇటు తిరిగి వెళ్లి పవన్ కళ్యాణ్ కి తగిలింది. పవన్ కళ్యాణ్ కి తాతగారి బుద్ధులు వచ్చాయంటూ… ట్రోలింగ్ మొదలైంది. ఎవరో ఆడియో ఫంక్షన్కు, ఫ్రీ రిలీజ్ ఫంక్షన్కు చీఫ్ గెస్ట్ గా పిలిస్తే అక్కడికి వచ్చిన అన్నయ్య టెంప్ట్ అయిపోయి ఏదేదో మాట్లాడేసి… చివరికి తాను చిక్కుల్లో పడి…. అందర్నీ చిక్కుల్లో పెట్టేస్తున్నాడు.తాను చాలా బోల్డ్…. ఓపెన్ మైండెడ్ గా కనిపించాలని చిరంజీవి తపనపడటంలో తప్పులేదు. కానీ అది బాలకృష్ణకే తప్ప చిరుకి కష్టం. చిరు ఇమేజ్ వేరు. ఆయన డిగ్నిటీ వేరు. అందువల్ల మున్ముందు కాస్త జాగ్రత్త పడితే…. ఇండస్ట్రీలో పెద్దమనిషి హోదా కావాలనుకుంటున్న మెగాస్టార్ కి అది చిరకాలం నిలబడుతుంది.