Chiranjeevi: మెగా సస్పెన్స్‌.. “హనుమాన్-2”లో భజరంగ్‌గా మెగాస్టారేనా..?

హ‌నుమాన్-2పై ఇప్ప‌టి నుంచే పాన్ వ‌రల్డ్ మూవీగా భారీగా అంచ‌నాలు పెరిగిపోయాయి. ఇక ఇప్పుడు హ‌నుమాన్‌-2లో భ‌జ‌రంగ్‌గా క‌నిపించ‌బోయే బిగ్ స్టార్ మెగాస్టారే అంటూ వినిపిస్తున్న వార్త‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 24, 2024 | 02:56 PMLast Updated on: Jan 24, 2024 | 2:56 PM

Chiranjeevi Will Be Hanuman In Jai Hanuman Movie

Chiranjeevi: టాలీవుడ్‌ యువ హీరో తేజ సజ్జా.. తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ హనుమాన్‌. సూపర్ హీరో సిరీస్‌గా ప్రశాంత్‌వర్మ తెరకెక్కించిన‌ హనుమాన్ వసూళ్ల ప్ర‌భంజ‌నం సృష్టిస్తోంది. బ్లాక్ బస్ట‌ర్ టాక్‌తో, భారీ వ‌సూళ్ల‌తో దూసుకుపోతోంది. ఈ సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాల నడుమ చిన్న సినిమాగా విడుదలై.. పెద్ద సినిమాల‌కు ధీటుగా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. తగినన్ని థియేటర్స్ దొరకనప్పటికీ హౌస్ ఫుల్స్‌తో స్టార్ హీరోల సినిమాల రేంజ్‌లో అదిరిపోయే వసూళ్లు రాబడుతోంది.

Pushpa2 The Rule: యాక్షన్ మోడ్.. జపాన్ డాన్‌తో పుష్పరాజ్ భారీ ఫైట్

దీంతో.. హ‌నుమాన్-2పై ఇప్ప‌టి నుంచే పాన్ వ‌రల్డ్ మూవీగా భారీగా అంచ‌నాలు పెరిగిపోయాయి. ఇక ఇప్పుడు హ‌నుమాన్‌-2లో భ‌జ‌రంగ్‌గా క‌నిపించ‌బోయే బిగ్ స్టార్ మెగాస్టారే అంటూ వినిపిస్తున్న వార్త‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. హ‌నుమాన్‌-2 ప్రాజెక్టులో హ‌నుమంతుడిగా ఓ పెద్ద స్టార్ క‌నిపించ‌బోతున్నారంటూ ప్ర‌శాంత్ వ‌ర్మ ఇచ్చిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఆడియెన్స్‌కు మంచి కిక్ ఇచ్చింది. దీంతో.. హ‌నుమాన్-2లో క‌నిపించ‌బోయే ఆ బిగ్ స్టార్ ఎవ‌రా అన్న‌దానిపై హాట్ హాట్‌గా డిస్క‌ష‌న్ న‌డుస్తోంది. చాలా మంది అయితే భ‌జ్‌రంగ్‌గా క‌నిపించేది మెగాస్టార్ చిరునే అని చాలా మంది ఫిక్స‌యిపోయారు. ఆయ‌న అయితేనే బాగుంటుంద‌ని అనేక మంది ఆశ‌ప‌డుతున్నారు. ఇక‌.. మెగాస్టార్ చిరంజీవి హ‌నుమంతుడి భ‌క్తుడు అన్న విష‌యం తెలిసిందే.

హ‌నుమాన్ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు కూడా వ‌చ్చిన చిరు.. టీమ్‌కు మంచి స‌పోర్ట్ అందించారు. ఇక‌.. హీరో తేజ‌, డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌తో కూడా మెగాస్టార్‌కు మంచి అనుబంధం ఉంది. ఈ నేప‌థ్యంలోనే హ‌నుమంతుడు-2లో భ‌జ‌రంగ్ పాత్ర‌కు చిరు అయితేనే న్యాయం జ‌రుగుతుంద‌న్న కామెంట్లు వినిపిస్తున్నాయి. మ‌రి.. ప్ర‌శాంత్ నీల్ చెప్పిన‌ట్లు భ‌జ‌రంగ్‌-2లో క‌నిపించ‌బోయే ఆ బిగ్ స్టార్ ఎవ‌రో అన్న‌ది తెలియాలంటే, ఈ స‌స్పెన్స్‌కు తెర‌ప‌డాలంటే మ‌రికొద్ది రోజులు ఆగాల్సిందే.