Chiranjeevi: మోకాలి సర్జరీ తర్వాత చిరు డాన్స్ చేయరా..?
రీసెంట్ గా ప్రభాస్‌లానే చిరుకి కూడా మోకాలి సర్జరీ అయ్యింది. కాకపోతే ప్రభాస్ యంగ్‌స్టర్. తను కోలుకుని చిందేయటం పెద్ద విషయం కాదు. కానీ, చిరు మాత్రం 60 ఏళ్లు నిండిన సీనియర్ హీరో. తను ఎంత మంచి డాన్సర్ అయినా ఏజ్ వల్ల వచ్చే ఇబ్బందులు తప్పవు.
Chiranjeevi: మెగాస్టార్‌తో డైమండ్ ఐస్ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్ జోడీ కడితే.. ఆ ఇద్దరూ కలిసి చిందేస్తే బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే. ఇదే అద్భుతం దర్శకుడు వశిష్ట మేకింగ్‌లో చిరు చేయబోయే సోషియో ఫాంటసీ మూవీలో జరగబోతోంది. ఇందులో అనుష్క, మృణాల్ ఠాకూర్‌తోపాటు ఐశ్వర్య రాయ్ కూడా చిరుతో స్క్రీన్ షేర్ చేసుకోవటం పక్కా అంటున్నారు. ఐతే మరో ప్రచారం ప్రకారం అనిల్ రావిపుడి మేకింగ్‌లో చిరు చేసే సినిమాకే ఐశ్వర్యా రాయ్ ఓకే చెప్పిందని తెలుస్తోంది.
ఈ రెండు సినిమాల్లో ఏది ఐశ్వర్యా రాయ్ ఓకే చేసినా, అది గుడ్ న్యూసే. కాని ఇక్కడ ఒక డౌటు బ్యాడ్ న్యూస్‌లా మారుతోంది. అదే చిరు డాన్స్ మీద పెరిగిన అనుమానాలు..! రీసెంట్ గా ప్రభాస్‌లానే చిరుకి కూడా మోకాలి సర్జరీ అయ్యింది. కాకపోతే ప్రభాస్ యంగ్‌స్టర్. తను కోలుకుని చిందేయటం పెద్ద విషయం కాదు. కానీ, చిరు మాత్రం 60 ఏళ్లు నిండిన సీనియర్ హీరో. తను ఎంత మంచి డాన్సర్ అయినా ఏజ్ వల్ల వచ్చే ఇబ్బందులు తప్పవు. అందుకే హెవీ స్టెప్స్ చేయకుండా, స్టైలిష్‌గా ఉండే స్మాల్ మూమెంట్స్‌తో ఆకట్టుకుంటున్నాడు చిరు.
సరే సెకండ్ ఇన్నింగ్స్‌లో తన డాన్స్‌లో గ్రేస్ తగ్గలేదనుకునే టైంలోనే మోకాలి సర్జరీ జరిగింది. దీంతో చిరు ఇక డాన్స్ చేయటం కష్టమేనా అనంటున్నారు. అదే జరిగితే చిరు సినిమాలో మెగా మ్యాజిక్కే మిస్ అవుతుంది. కానీ, చిరు తన ఫ్యాన్స్‌ని డిసప్పాయింట్ చేయడు. ఏదోలా చిందేసేందుకే ట్రై చేస్తాడు. ఐనా గత వైభవం ఉంటుందా అనేదే డౌటు..!