Chiranjevi: మెగా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు
మెగాస్టార్ ఫ్యాన్స్ కి భోళా శంకర్ తాలూకు ఒక అంశం నచ్చట్లేదు. చిరు విషయంలో ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారట. అదే మెగాస్టార్ అంతటి వాడు మరో హీరోని ఇమిటేట్ చేయటం. సొంతం తమ్ముడే అయినా, తన వారసుడు చెర్రీ ఎంత మంచి సినిమాలు తీసినా, మెగాస్టార్ రేంజ్ వేరు..

Chiranjeevi's imitation scenes in Bhola Shankar, directed by Mehr Ramesh, are causing serious discomfort to fans
నటుడిగా, స్టార్ గా మెగా వ్రుక్షాన్ని, హిస్టరీని క్రియేట్ చేసిన చిరు, పవన్ మ్యానరిజమ్స్ ని, చరణ్ మ్యానరిజమ్స్ ని ఇమిటేట్ చేయటం మీద మెల్లిగా సోషల్ మీడియాలో కామెంట్లు మొదలయ్యాయి. దీనంతటికీ కారణం భోళా శంకర్ డైరెక్టర్ మెహర్ రమేషే అంటున్నారు. సినిమాలు తీయరాక రీమేకులతో నెట్టుకొచ్చే తను, ఏదో మాస్ ని ఆకట్టుకోబోయి, కామెడీ డోసుపెంచబోయి, ఇలాంటి పిచ్చి పనిచేశాడంటున్నారు.
పవన్, చరణ్ ని ఇమిటేట్ చేయటమే కాదు, చిరు ఇంకా రాజశేఖర్ ని కూడా ఇమిటేట్ చేసేసీన్లు పెట్టాడట మెహర్ రమేష్. సో భోళా శంకర్ లో ఇలాంటి సీన్లు పెట్టి తన పైత్యం ప్రదర్శించిన డైరెక్టర్, తన బుర్రతక్కువ తనంతో చిరు స్థాయిని తగ్గిస్తుండటమే ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇండస్ట్రీకోసం వందమెట్లు దిగి ఏపీ సీఎం జగన్ మీటింగ్ లో చేతులు జోడించిన చిరు సీన్ నే మర్చిపోని ఫ్యాన్స్ కి ఇలాంటి ఇమిటేషన్ల గోల మరో సారి జీర్ణించుకునే విధంగా లేదని చర్చ నడుస్తోంది.