చిరంజీవి అమ్మగారు అంజనీ దేవికి అస్వస్థత.. అసలు ఏమైందో తెలుసా..?
మెగాస్టార్ చిరంజీవి అమ్మగారు అంజనీ దేవి అస్వస్థతకు గురయ్యారు. ఈమె ఆరోగ్యంపై వస్తున్న వార్తలు విని మెగా అభిమానులు కంగారు పడుతున్నారు. అసలేమైంది.. అంజనమ్మ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది అంటూ ఆరా తీస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి అమ్మగారు అంజనీ దేవి అస్వస్థతకు గురయ్యారు. ఈమె ఆరోగ్యంపై వస్తున్న వార్తలు విని మెగా అభిమానులు కంగారు పడుతున్నారు. అసలేమైంది.. అంజనమ్మ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది అంటూ ఆరా తీస్తున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజమా అబద్దమా అని తెలియక వాళ్ళలో డైలమా పెరిగిపోతుంది. అయితే మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న వార్తలు ప్రకారం చూస్తే అంజనీ దేవి గారి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉంది. కేవలం వయసు రీత్యా వచ్చిన సమస్యలు తప్పిస్తే ఆమెకు మిగిలిన ఏ అనారోగ్య సమస్యలు లేవు అని తెలుస్తుంది.
ఈ మధ్యే అమ్మ పుట్టిన రోజును ఘనంగా జరిపాడు చిరంజీవి. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది కూడా. అంతలోనే అంజనమ్మకు అస్వస్థత అని వార్తలు రావడంతో ఫ్యాన్స్ లో కంగారు మొదలైంది. గత కొన్ని రోజులుగా వయోభారంతో ఆమె ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే చిన్న చిన్న ఇబ్బందులు వచ్చాయి కానీ అవి సీరియస్ కాదు అంటున్నారు వైద్యులు కూడా. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటే మళ్ళీ అంజనమ్మ గారు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టే అంటున్నారు వాళ్లు.
కొన్ని అనారోగ్య కారణాల వల్ల తరచుగా హాస్పిటల్ వెళ్లి వస్తున్నారు అంజనమ్మ. ఈ మధ్య ఒక ప్రైవేట్ హాస్పిటల్లో రెండు మూడు రోజులు చికిత్స కూడా తీసుకున్నారని తెలుస్తుంది. అమ్మకు ఒంట్లో బాలేదు అని తెలిసి పవన్ కళ్యాణ్ కూడా విజయవాడ నుంచి బయలుదేరినట్టు ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో వినిపిస్తున్నట్టు ఒకవేళ నిజంగానే అంజనమ్మ గారి ఆరోగ్యం బాగోలేకపోతే చిరంజీవి తన వెడ్డింగ్ యానివర్సరీని అంత ఆనందంగా జరుపుకోడు కదా అనేది ఇక్కడ లాజిక్. దీన్నిబట్టి మెగా మదర్ ఆరోగ్యంగానే ఉన్నారు అని అర్థమవుతుంది. కాకపోతే వయోభారం ఉంది కాబట్టి వయసు రీత్యా వచ్చే సమస్యలు తప్పవు.