సల్మాన్ ఖాన్ కు చిరంజీవి రిటర్న్ గిఫ్ట్

ఒకప్పుడు బాలీవుడ్, టాలీవుడ్ వేరు గాని ఇప్పుడు అన్నీ ఒకటే అయ్యాయి. అక్కడి సినిమాలను మించి ఇక్కడ సినిమాలకు వసూళ్లు రావడంతో బాలీవుడ్ హీరోలు కూడా ఇప్పుడు టాలీవుడ్ దర్శకులకు అవకాశాలు ఇస్తున్నారు. అందుకే యానిమల్ సినిమాతో సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ ని షేక్ చేసాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 3, 2024 | 02:09 PMLast Updated on: Sep 03, 2024 | 2:09 PM

Chiranjeevis Return Gift To Salman Khan 2

ఒకప్పుడు బాలీవుడ్, టాలీవుడ్ వేరు గాని ఇప్పుడు అన్నీ ఒకటే అయ్యాయి. అక్కడి సినిమాలను మించి ఇక్కడ సినిమాలకు వసూళ్లు రావడంతో బాలీవుడ్ హీరోలు కూడా ఇప్పుడు టాలీవుడ్ దర్శకులకు అవకాశాలు ఇస్తున్నారు. అందుకే యానిమల్ సినిమాతో సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ ని షేక్ చేసాడు. కబీర్ సింగ్ తోనే బాలీవుడ్ హీరోలను ఫిదా చేసాడు సందీప్ రెడ్డి. ఇక జవాన్ సినిమాతో తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ జవాన్ సినిమాతో బాలీవుడ్ కు తానేంటి అనేది చూపించాడు. అందుకే ఇప్పుడు అక్కడి హీరోలకు మన వాళ్ళే దిక్కు అయ్యారు.

ఇప్పుడు సల్మాన్ ఖాన్… అట్లీతో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా భారీగా ఉండే అవకాశం కనపడుతోంది. అందుకే ఇందులో సౌత్ స్టార్ లు అందరిని బాలీవుడ్ కు పరిచయం చేసే యోచనలో ఉన్నాడట అట్లీ. రజనీ కాంత్ ను ఒక 5 నిమిషాలు, కమల్ హాసన్ కు పూర్తి రూల్, మోహన్ లాల్ కు 5 నిమిషాలు, చిరంజీవికి 10 నిమిషాలు కేటాయించాడు అని టాక్. గాడ్ ఫాథర్ సినిమాలో సల్మాన్ ఖాన్ కనపడి ఫ్యాన్స్ ని అలరించాడు. అయితే బాడీ గార్డ్ ని చేసారనే విమర్శలు ఎక్కువగా వచ్చాయి.

ఇక తన సినిమాలను సౌత్ లో కూడా గట్టిగా ఆడించాలని ప్లాన్ చేస్తున్న సల్మాన్… తెలుగు రాష్ట్రాల కోసం చిరంజీవిని తీసుకుంటా అని చెప్తే ఓకే అన్నాడట. ఇక అట్లీ కూడా చిరంజీవిని అడగడంతో చిరు కూడా ఓకే చేసారు. గాడ్ ఫాదర్ లో తాను అడిగిన వెంటనే సల్మాన్ ఓకే చేయడంతోనే చిరు ఓకే చేసారని టాక్. ఇక చిరంజీవి పాత్రను పవర్ ఫుల్ గా ప్లాన్ చేయాలని అట్లీ భావిస్తున్నారు. ఇది మల్టీ స్టారర్ సినిమా అని అందులో కమల్ హాసన్ ను తీసుకుంటారని చర్చలు జరుగుతున్నాయి. అటు శివ రాజ్ కుమార్ ను కూడా తీసుకునే ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్.