Chiru – Salman: సల్మాన్‌కి చిరంజీవి రిటర్న్ గిఫ్ట్

గాడ్‌ఫాదర్‌లో చిరుతో కలిసి సల్మాన్‌ స్టెప్పులేయగా.. కిసీ కా భాయ్‌లో సల్మాన్‌తో కలిసి డ్యాన్స్ చేశాడు చెర్రీ. ఆల్రెడీ ఈ పాట షూటింగ్‌ పూర్తయిందని తెలిసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 9, 2023 | 07:12 PMLast Updated on: Mar 09, 2023 | 7:12 PM

Chiranjeevis Return Gift To Salman Khan

మెగా ఫ్యామిలీ సల్మాన్‌ఖాన్‌ రుణం తీర్చేసుకుంది. అడగ్గానే గాడ్‌ఫాదర్‌లో గెస్ట్‌ అపీరియన్స్‌ ఇచ్చాడు సల్మాన్‌. ఒక్క రూపాయి రెమ్యునరేషన్‌ తీసుకోకుండా నటించేశాడు. పారితోషికం బదులు ఏదో ఒక గిఫ్ట్ ఇద్దామనుకుంటే.. కుదర్లేదు. . ఈ రిలేషన్‌ ఇవాల్టిది కాదు. రామ్‌చరణ్‌ ముంబయి వెళ్తే.. సల్మాన్‌ను కలుస్తాడు. సల్మాన్‌ హైదరాబాద్‌ వస్తే.. మెగా ఫ్యామిలీని కలవాల్సిందే. జంజీర్‌తో హిందీలోకి అడుగుపెట్టిన రామ్‌చరణ్‌కు సల్మాన్‌ అండగా వుంటూ.. సినిమాను హిందీలో ప్రమోట్‌ చేశాడు సల్లూభాయ్‌. ప్రేమ్‌ రతన్‌ ధన్‌పాయో తెలుగు అనువాదం ప్రేమలీలలో సల్మాన్‌కు రామ్‌చరణ్‌ వాయిస్‌ ఇచ్చాడు.

గాడ్‌ఫాదర్‌ సినిమాను పాన్‌ ఇండియా రిలీజ్‌ చేద్దామనుకున్నప్పుడు.. హీరోకు అండగా వుండే క్యారెక్టర్‌ కోసం చిరంజీవి సల్మాన్‌ పేరు చూపించాడు. అడగటమే ఆలస్యం డేట్స్ ఇచ్చేశాడు సల్మాన్‌. సినిమా ప్రమోషన్‌లో చిరంజీవి మాట్లాడుతూ.. సల్మాన్‌ భాయ్‌ ఒక్క రూపాయి రెమ్యునరేషన్‌ తీసుకోకుండా నటించాడని.. ఇందుకు ప్రతిఫలంగా రామ్‌చరణ్‌ ఏదో ఒకటి ఇవ్వడానికి ప్లాన్‌ చేస్తున్నాడన్నాడు.
గాడ్‌ఫాదర్‌లో నటించినందుకు సల్మాన్‌ రెమ్యునరేషన్‌ తీసుకోకపోయినా.. మెగా ఫ్యామిలీ తర్వాత గిఫ్ట్‌ ఇవ్వకపోయినా… సల్మాన్‌ సాయం తీర్చేసుకున్నాడు చెర్రీ.

సల్మాన్‌ నటిస్తున్న ‘కిసీ కాభాయ్‌.. కిసీ కి జాన్‌’ ఏప్రిల్‌ 21న రిలీజ్‌ అవుతోంది. పూజాహెగ్డే హీరోయిన్‌. వెంకటేశ్‌ ముఖ్య పాత్రలో నటించాడు. సినిమాలో రామ్‌చరణ్‌ కూడా గెస్ట్ రోల్ చేసాడు. గాడ్‌ఫాదర్‌లో చిరుతో కలిసి సల్మాన్‌ స్టెప్పులేయగా.. కిసీ కా భాయ్‌లో సల్మాన్‌తో కలిసి డ్యాన్స్ చేశాడు చెర్రీ. ఆల్రెడీ ఈ పాట షూటింగ్‌ పూర్తయిందని తెలిసింది. గాడ్‌ఫాదర్‌లో సల్మాన్‌ రెమ్యునరేషన్‌కు ఇది చెల్లు కాకపోయినా… వెంకటేశ్‌, రామ్‌చరణ్‌ లాంటి తెలుగు హీరోలు వుండడంతో… ఈ హిందీ మూవీ ఇక్కడ క్రేజీ ఇమేజ్‌తో రిలీజ్‌ కానుంది. సో ఫైనల్ గా చిరంజీవి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసాడు.