Chiranjeevi: మాస్ రచ్చ.. నెక్ట్స్ లెవల్‌లో పోరాట సన్నివేశాలు..!
మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న నయా మూవీ విశ్వంభర. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకొంటుంది. కొన్ని రోజుల క్రితం చిరంజీవి షూటింగ్‌లోకి ఎంటర్ అయ్యాడు.

Chiranjeevi is clashing legends with Bimbisara fame director and Vishwambhara.
Chiranjeevi: నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినిమా ప్రేక్షకులని, మరీ ముఖ్యంగా తన అభిమానులని అలరిస్తున్న అగ్ర నటుడు చిరంజీవి. ఆయన సినిమా రిలీజ్ అయినప్పుడు ఫ్యాన్స్‌లో ఎంత ఉత్తేజం ఉంటుందో ఆ సినిమా షూటింగ్ని జరుపుకొంటున్నపుడు కూడా ఫ్యాన్స్‌లో అంతే ఉత్తేజం ఉంటుంది. తాజాగా ఆయన మూవీకి సంబంధించిన న్యూస్ ఒకటి అభిమానుల్లో ఆనందాన్ని నింపుతోంది. మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న నయా మూవీ విశ్వంభర.
valentine day special: ప్రేమ వర్షం.. వాలెంటైన్స్ డే స్పెషల్.. తిరిగొస్తున్న ప్రేమకథలు
సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకొంటుంది. కొన్ని రోజుల క్రితం చిరంజీవి షూటింగ్‌లోకి ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు ఆ షెడ్యూల్ నిర్విరామంగా కంప్లీట్ చేసుకుంది. అత్యంత భారీ సెట్టింగ్స్ నడుమ విశ్వంభరకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలని మేకర్స్ చిత్రీకరించారు. అలాగే కొన్ని పోరాట సన్నివేశాలని కూడా ఈ షెడ్యూల్‌లో తెరకెక్కించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆ పోరాట సన్నివేశాలు ఒక లెవల్లో ఉన్నాయని, రేపు థియేటర్స్‌లో ఫ్యాన్స్‌కి పూనకాలు రావడం గ్యారంటీ అనే మాటలు వినిపిస్తున్నాయి. భోళా శంకర్ పరాజయంతో మెగా అభిమానులు విశ్వంభర కోసం వెయిట్ చేస్తున్నారు.
జనవరి 10, 2025న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవ్వబోతున్న విశ్వంభరలో చిరు సరసన ఒక హీరోయిన్‌గా త్రిష చేస్తుంది. ఇంకో ఇద్దరు హీరోయిన్‌లకి చిరు పక్కన ఛాన్స్ ఉంది. వాళ్ళ వివరాలు కూడా త్వరలోనే తెలియనున్నాయి. అలాగే మిగతా తారాగణం వివరాలు కూడా వెల్లడి కానున్నాయి. యూవీ క్రియేషన్స్ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న విశ్వంభరకి ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు. చిరు కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది.