మైత్రీకి చిరంజీవి వార్నింగ్.. “వాడ్ని చూసుకుని.. రెచ్చిపోతే నేను చేసేది చేస్తా”
టాలీవుడ్ లో ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల వార్ వేరే లెవెల్ లో జరుగుతోంది. ప్రతి సినిమాకు ఏదో ఒక నాన్సెన్స్ క్రియేట్ అవుతూనే ఉంది. సినిమాలను ఏదో ఒక రకంగా ఇబ్బందులు పెట్టి కొంతమంది తమ సినిమాలకు బెనిఫిట్ చేసుకోవాలని ఏ రూట్లో కుదిరితే ఆ రూట్లో ప్రయత్నాలు మొదలుపెట్టారు.
టాలీవుడ్ లో ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల వార్ వేరే లెవెల్ లో జరుగుతోంది. ప్రతి సినిమాకు ఏదో ఒక నాన్సెన్స్ క్రియేట్ అవుతూనే ఉంది. సినిమాలను ఏదో ఒక రకంగా ఇబ్బందులు పెట్టి కొంతమంది తమ సినిమాలకు బెనిఫిట్ చేసుకోవాలని ఏ రూట్లో కుదిరితే ఆ రూట్లో ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముఖ్యంగా పుష్ప సినిమా మేకర్స్ చేస్తున్న రచ్చ అంతా కాదు. పుష్ప సినిమా కోసమే డిస్ట్రిబ్యూటర్స్ గా మారిన మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఆ తర్వాత కాస్త వేరే సినిమాలను కూడా ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నాలు చేశారు.
కన్నడలో డిస్ట్రిబ్యూటర్లను కూడా కాస్త ఇబ్బంది పెట్టారనే టాక్ వచ్చింది. నైజాంలో కూడా దిల్ రాజుకు వాళ్లకు ఇబ్బందులు వచ్చాయి అనే ప్రచారం కూడా జరిగింది. ఇక లేటెస్ట్ గా గేమ్ చేంజర్ సినిమాను ఇబ్బంది పెట్టడానికి మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ప్లాన్ చేసుకున్నారు. అల్లు అర్జున్ కోసం చేశారా లేదంటే మరి ఏదైనా రీజన్ ఉందా అనేది తెలియదు.. గానీ పుష్ప సినిమాకు మరో 20 నిమిషాలు యాడ్ చేస్తూ ఈనెల 11 నుంచి ధియేటర్లలో రీలోడేడ్ వెర్షన్ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. దీనిపై ఒకరకంగా పెద్ద రచ్చ జరిగింది.
సినిమా రన్ టైం ఇప్పటికే మూడు గంటల 17 నిమిషాలతో ప్రేక్షకులకు పేషెన్స్ టెస్ట్ చేసిందని.. దీనికి మరో 20 నిమిషాలు ఆడ్ చేయడంతో ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారో అనే టాక్ కూడా వచ్చింది. ఇక గేమ్ చేంజర్ సినిమా ఈనెల 10న రిలీజ్ అవుతున్న టైంలో ఈ విధంగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారంటూ సినిమా వాళ్లు కూడా మైత్రి మూవీ మేకర్స్ పై కాస్త ఫైర్ అయ్యారు. అయితే ఇప్పుడు ఈ విషయంలో కాస్త బ్యాక్ స్టెప్ వేసినట్టు టాక్. పుష్పా టీం జనవరి 11 నుంచి 17 వరకు షిఫ్ట్ అయిందట.
గేమ్ చేంజర్ సినిమా డామినేషన్ తోనే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే గేమ్ చేంజర్ సినిమా కోసం థియేటర్లు తగ్గాయి. అటు బాలకృష్ణ సినిమా వెంకటేష్ సినిమాలు కూడా ఉండటంతో థియేటర్లు భారీగా కేటాయించలేని పరిస్థితి క్రియేట్ అయింది. ఇలాంటి టైంలో పుష్పా 2 టీం తీసుకున్న డెసిషన్ పై కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ గట్టిగానే వచ్చాయి. ఇక దీనిపై మెగాస్టార్ చిరంజీవి డైరెక్ట్ గానే సీరియస్ అయినట్లు టాక్. మైత్రి మూవీ మేకర్స్ అధినేతలతో ఆయన ఫోన్లో మాట్లాడి రీలోడెడ్ వర్షన్ విషయంలో ఆలోచించుకోకపోతే తాను చేయాల్సింది చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారట. దీంతో మైత్రి మూవీ మేకర్స్ ఈ విషయంలో కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు అల్లు అర్జున్ సపోర్ట్ చూసుకుని చెలరేగిపోయిన మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు కాస్త బ్యాక్ స్టెప్ వేస్తున్నారు.