Chiru 156 : చిరు 156… ఆరు నెలలు దాని కోసమేనా..

మెగాస్టార్ (Megastar) చిరంజీవి (Chiranjeevi) జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నారు. వశిష్ట డైరెక్షన్‌లో రూపొందిస్తున్న సోషీయో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ (Vishwambhara) కోసం విపరీతంగా కష్టపడుతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 2, 2024 | 10:50 AMLast Updated on: Apr 02, 2024 | 10:50 AM

Chiru 156 Six Months Is For It

మెగాస్టార్ (Megastar) చిరంజీవి (Chiranjeevi) జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నారు. వశిష్ట డైరెక్షన్‌లో రూపొందిస్తున్న సోషీయో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ (Vishwambhara) కోసం విపరీతంగా కష్టపడుతున్నారు. నిన్నగాక మొన్న మొదలైన ఈ మూవీ షూటింగ్ అప్‌డేట్ గురించి తెలిస్తే ఫ్యాన్స్‌కు కూడా షాక్ తప్పదు. అంత వేగంగా సినిమాను పూర్తి చేస్తున్నారు. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ మూవీని 2025 సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేస్తామ‌ని ముందే చెప్పేసారు. దీంతో.. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ నుంచి వినిపిస్తోన్న లేటెస్ట్ బజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

విశ్వంభర కోసం నాన్‌స్టాప్‌గా వర్క్‌ చేస్తున్న చిరు ఇటీవ‌లే షూట్ నుంచి బ్రేక్ తీసుకున్నారు. దీంతో యూనిట్ నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తోంది. ఇక ఇప్పటి వరకు జరిగిన షూటింగ్‌పై షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే మూడు.. నాలుగు షెడ్యూళ్ల షూటింగ్ పూర్తయ్యిందట.. అంటే.. దాదాపు 50 శాతం షూటింగ్ పూర్తయిందని. మిగిలిన 50 శాతం జూన్ క‌ల్లా పూర్తయ్యేలా ద‌ర్శకుడు వ‌షిష్ట ప్లాన్ చేస్తున్నాడని టాక్‌ వినిపిస్తోంది. మిగిలిన ఆరు నెలలను సినిమాకు సంబంధించి నిర్మాణానంతర పనుల‌కే కేటాయించిన‌ట్లు తెలుస్తోంది. విశ్వంభ‌ర సోషియా ఫాంట‌సీ మూవీ కావడంతో.. ఎక్కువ సమయం పోస్ట్ ప్రొడ‌క్షన్‌కే కేటాయించాడట వశిష్ట.. విశ్వంభర మూవీ ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడట వశిష్ట.. సో.. ఈ మూవీలో గ్రాఫిక్స్‌ ఎక్కువగా ఉంటాయి. దీంతో. ఈ సీజీ వ‌ర్క్స్ కి సంబంధించి హాంకాంగ్ కంపెనీకి ఆ బాద్యత‌లు అప్పగిస్తున్నట్లు టాక్ వినిపిస్త్తోంది. అందుకోసం ఆ కంపెనీతో కోట్ల రూపాయ‌ల‌తో ఒప్పందం చేసుకున్నాడంటూ టాలీవుడ్ వర్గాల భోగ‌ట్టా..

కాగా.. విశ్వంభరకు సంబంధించి రీసెంట్‌‌‌‌గా హైదరాబాద్‌‌‌‌లో ఓ కీలక షెడ్యూల్‌‌‌‌ను పూర్తి చేశారు.. సోమవారం నుంచి కొత్త షెడ్యూల్‌‌‌‌ను తిరిగి హైదరాబాద్‌‌‌‌లో మొదలుపెట్టారు. సిటీలోని డిఫరెంట్ లొకేషన్స్‌‌‌‌లో యాక్షన్ సీక్వెన్స్‌‌‌‌ను షూట్ చేస్తున్నారు. ఇది ఇంటర్వెల్ బ్లాక్‌‌‌‌లో వచ్చే సీన్‌‌‌‌ అని తెలుస్తోంది. అలాగే చిరంజీవి, త్రిషతో పాటు ఇతర నటీనటులపై ఇంపార్టెంట్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.. ఇందులో చిరంజీవి డ్యూయెల్ రోల్ చేస్తున్నారని, అందులో ఒకటి యంగ్‌‌‌‌ లుక్‌‌‌‌ కాగా, వయసు పైబడిన మరో పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదల కానున్న ఈ మూవీలో చిరంజీవి రాకింగ్ పర్‌ఫార్మెన్స్ ఖాయమంటున్నారు.