మళ్ళీ బాక్సాఫీస్ వద్ద చిరు – బాలయ్య పోటీ…?

టాలీవుడ్ లో సంక్రాంతికి ఉండే క్రేజ్ వేరు. అగ్ర హీరోల సినిమాలు విడుదలకు సంక్రాంతి ఎక్కువగా వేదిక అవుతూ ఉంటుంది. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ సంక్రాంతి కానుకగా సినిమాలను విడుదల చేసి హిట్ కొడుతూ ఉంటారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 22, 2024 | 12:45 PMLast Updated on: Aug 22, 2024 | 12:45 PM

Chiru Balayya Competition Again At The Box Office

టాలీవుడ్ లో సంక్రాంతికి ఉండే క్రేజ్ వేరు. అగ్ర హీరోల సినిమాలు విడుదలకు సంక్రాంతి ఎక్కువగా వేదిక అవుతూ ఉంటుంది. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ సంక్రాంతి కానుకగా సినిమాలను విడుదల చేసి హిట్ కొడుతూ ఉంటారు. అఖండ సినిమా నుంచి అన్ని సినిమాలు బాలయ్యకు మంచి హిట్స్ ఇస్తున్నాయి. దీనితో ఆయన చేస్తున్న సినిమాలపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు బాబీ దర్శకత్వంలో ఆయన ఒక సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాను పక్కా కమర్షియల్ యాంగిల్ లో ప్లాన్ చేస్తున్నారు.

దీనికి సంబంధించి ఇప్పటికె టీజర్ కూడా విడుదలైన సంగతి తెలిసిందే. ఇక సినిమాను సంక్రాంతికి విడుదల చేసే విధంగా బాలయ్య ప్లాన్ లో ఉన్నారట. సంక్రాంతి బాలయ్యతో పాటు ఇప్పుడు మరో స్టార్ హీరో కూడా రంగంలోకి దిగుతున్నారు అని తెలుస్తోంది. ఆయనే మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తారని తెలుస్తోంది. ఇలా మరోసారి బాలయ్య, చిరంజీవి… సంక్రాంతికి పోటీ పడతారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

గత ఏడాది ఈ ఇద్దరూ వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడగా… రెండు సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఈ సారి మళ్ళీ ఇద్దరూ తలపడుతున్నారు. బాలయ్య సినిమా ముందు దసరాకు విడుదల అయ్యే అవకాశం ఉందని అందరూ భావించారు. కాని తనకు బాగా కలిసి వచ్చిన సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ పెట్టుకున్నారట. అందుకే సినిమా షూట్ ని కాస్త ఆలస్యం అయినా సరే ఫ్యాన్స్ ఎక్కడా నిరాశపడకుండా ప్లాన్ చేయాలని చూస్తున్నారు. దర్శకుడు బాబీ కూడా కొన్ని సీన్స్ లో మార్పులు చేస్తున్నారని సమాచారం. ఇక సంక్రాంతి బరిలో ఈ రెండు సినిమాలతో పాటుగా మరిన్ని సినిమాలు లైన్ లో ఉన్నాయి.