ఇంద్ర రోజులను గుర్తు చేసుకున్న చిరూ…
తెలుగు సినిమా చరిత్రలో ఇంద్ర ఒక సంచలనం. ఈ పేరు ఇప్పుడు వినపడినా మెగా అభిమానుల్లో ఉత్సాహం పొంగిపోతుంది. మెగాస్టార్ చిరంజీవి తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేసేసారు. సినిమా మొదటి నుంచి చివరి వరకు ప్రతీ షాట్ కూడా ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు బీ గోపాల్.
తెలుగు సినిమా చరిత్రలో ఇంద్ర ఒక సంచలనం. ఈ పేరు ఇప్పుడు వినపడినా మెగా అభిమానుల్లో ఉత్సాహం పొంగిపోతుంది. మెగాస్టార్ చిరంజీవి తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేసేసారు. సినిమా మొదటి నుంచి చివరి వరకు ప్రతీ షాట్ కూడా ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు బీ గోపాల్. ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్ కూడా స్నేహలతా రెడ్డిగా ఎంతో పవర్ ఫుల్ గా కనపడింది. ఇక విలన్ గా ముఖేష్ రుషి అయితే ప్రాణం పెట్టారు. సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇప్పుడు వచ్చినా మెగా ఫ్యాన్స్ కి పూనకాలు వస్తాయి.
సినిమాలో పాటలు కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా అప్పుడు ఎన్నో రికార్డులు కొల్లగొట్టింది అనే చెప్పాలి. చిరంజీవి రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది అని ఈ సినిమా నుంచే ఆయన అభిమానుల్లో కోరిక కలిగింది. ఇక ఇప్పుడు ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. దీనిపై చిరంజీవి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇక సినిమాలో పని చేసిన వారిని ఆకాశానికి ఎత్తేసారు చిరూ. ఇంద్రసేనా రెడ్డి అంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. రోమాలు నిక్క బోడుచుకుంటున్నాయి అన్నారు.
ఇంద్ర సినిమా అంత పెద్ద సక్సెస్ కావడానికి సినిమా కథ ప్రధాన కారణం అన్నారు చిరంజీవి. సినిమా ఎక్కడి నుంచి మొదలైనా చివరి వరకు చూస్తాం అన్నారు ఆయన. అందుకే ఇంద్రకు సంబంధించిన ప్రతీ విషయాన్ని ఇప్పటికి కూడా అందరూ గుర్తు పెట్టుకున్నారని చిరు చెప్పుకొచ్చారు. సినిమా కోసం పని చేసిన వాళ్ళు అందరూ కూడా ప్రాణం పెట్టి పని చేసారని గుర్తు చేసుకున్నారు. తన సినిమాల్లో అత్యంత గొప్ప సాంకేతిక విలువలు ఉన్న చిత్రం ఇంద్ర అన్నారు చిరంజీవి. ఒక్క మాటలో చెప్పాలంటే కమర్షియల్ చిత్రానికి ఉత్తమ ఉదాహరణ ఇంద్ర అని చిరూ కొనియాడారు. ఇప్పుడు రీ రిలీజ్ చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.