అనుష్క పెళ్లిపై క్లారిటీ.. ఆ దర్శకుడి కొడుకుతో మూడు ముళ్ళు వేయించుకోనుందా..?
తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు మొత్తం సౌత్ ఇండస్ట్రీలో ఎప్పుడూ నెవర్ ఎండింగ్ ట్రెండింగ్ టాపిక్ అనుష్క శెట్టి పెళ్లి. నిజంగానే ఇది ఒక గండికోట రహస్యం.

తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు మొత్తం సౌత్ ఇండస్ట్రీలో ఎప్పుడూ నెవర్ ఎండింగ్ ట్రెండింగ్ టాపిక్ అనుష్క శెట్టి పెళ్లి. నిజంగానే ఇది ఒక గండికోట రహస్యం. ఎందుకంటే తన పెళ్లి గురించి అనుష్కలు ఎప్పుడు అడిగినా ఇప్పుడు అప్పుడు అంటుంది కానీ ఆ అప్పుడు ఎప్పుడో చెప్పడం లేదు. వయసు 43కి వచ్చినా ఇంకా పెళ్లి మీద ధ్యాస లేదు అంటుంది ఈ జేజమ్మ. ఎంత తప్పించుకోవాలి అనుకున్న కూడా పెళ్లి ముచ్చట మరోసారి అనుష్క ముందు వాలింది. పెళ్లెప్పుడు అంటే తగిన వరుడు దొరికినప్పుడు అంటూ సమాధానం చెబుతుంది అనుష్క. ప్రభాస్ తో అనుష్కకు ప్రేమాయణం నడుస్తుందని కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో వచ్చాయి. అయితే దీనిపై ప్రభాస్ మాత్రం అలాంటిదేమీ లేదని ఖండించాడు. అనుష్క తన స్నేహితురాలు మాత్రమే.. తమ బంధాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దంటూ అభిమానులను కోరుతున్నాడు. ఇక అనుష్క కూడా ప్రభాస్ తో పెళ్లి అంటే నవ్వుకుంటుంది. తను మంచి స్నేహితుడు అంటూ కొట్టిపారేస్తుంది.
ప్రభాస్, అనుష్క జంట చూడ్డానికి బాగుంటారని.. పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అభిమానుల మనసులో కూడా ఉంది. కాకపోతే వాళ్ళిద్దరికీ ఆ ఉద్దేశం లేదు. ఇదే సమయంలో ఆ మధ్య ఓ క్రికెటర్ ను పెళ్లి చేసుకుంటుందనే ప్రచారం కూడా జరిగింది. దీన్ని కూడా ఖండించింది ఈమె. ఇదిలా ఉంటే తాజాగా అనుష్క పెళ్లి గురించి మరో క్రేజీ రూమర్ వచ్చింది. ఓ సీనియర్ దర్శకుడి కుమారుడితో అనుష్క పెళ్లి జరగబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే ఆయన ఓ బాలీవుడ్ రైటర్ ను పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చాడు. ఇప్పుడు ఆయన్ని రెండో పెళ్లి చేసుకోబోతుందనే ప్రచారం జరుగుతుంది. గతంలోనూ అనుష్క పెళ్లిపై చాలా రూమర్స్ వచ్చాయి. ఒక బిజినెస్ మాన్ కం నిర్మాతను పెళ్లి చేసుకోబోతుంది అంటూ అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. ఇప్పుడేమో దర్శకుడు కొడుకుతో పెళ్లి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇంత జరుగుతున్న అనుష్క మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందే తప్ప క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు. ప్రస్తుతానికి సినిమాలపైనే ఉందని పెళ్లి చేసుకునే తీరిక లేదంటుంది స్వీటీ. ప్రస్తుతం తెలుగులో క్రిష్ దర్శకత్వంలో ఘాటీ సినిమా చేస్తుంది దీంతో పాటు మలయాళంలో కథనార్ అనే సినిమా చేస్తుంది. ప్రస్తుతం అనుష్క చేతిలో ఈ రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయి. వీటి తర్వాతే కొత్త సినిమాలుకు సైన్ చేస్తారు అని చెప్పింది ఈ ముద్దుగుమ్మ. కెరీర్ పరంగా ఎలా ఉన్నా.. పెళ్లి కూడా ముఖ్యమే కదా అని అనుష్క పేరెంట్స్ కూడా చెబుతూనే ఉన్నారు. కానీ నిన్ను మాత్రం ఎందుకో మరి పెళ్లి అంటేనే దూరంగా వెళుతుంది. ఇప్పుడు దర్శకుడు కొడుకుతో పెళ్లి అనే వార్త నిజం అవుతుందా లేదా అనేది చూడాలి. తనను అర్థం చేసుకొనే సరిపోయే మనిషి దొరికినప్పుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని చెబుతోంది అనుష్క. మరి ఆ సరైనోడు దొరకడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో..!