Devara : దేవ‌ర రిలీజ్‌పై ఆ రోజే క్లారిటీ

ఆర్ఆర్ఆర్ (RRR) తర్వాత జూ.ఎన్టీఆర్ (Jr. NTR) హీరోగా నటిస్తున్న సినిమా 'దేవర' (Devara) .. రెండు భాగాలుగా తెరకెక్కున్న ఈ మూవీని దర్శకుడు కొరటాల శివ (Koratala Siva,) శర వేగంగా తెరకెక్కిస్తున్నాడు. 'జనతా గ్యారేజ్' (Janatha Garage) లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు కొరటాల శివతో ఎన్టీఆర్ చేస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. 'దేవర' ప్రపంచం ఎలా ఉండబోతుందనేది ఇప్ప‌టికే శాంపిల్ చూపించిన కొర‌టాల‌.. ఈ మూవీపై హైప్‌ని స్కైహై గా పెంచేశాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 15, 2024 | 11:55 AMLast Updated on: Feb 15, 2024 | 11:55 AM

Clarity On Devaras Release That Day

ఆర్ఆర్ఆర్ (RRR) తర్వాత జూ.ఎన్టీఆర్ (Jr. NTR) హీరోగా నటిస్తున్న సినిమా ‘దేవర’ (Devara) .. రెండు భాగాలుగా తెరకెక్కున్న ఈ మూవీని దర్శకుడు కొరటాల శివ (Koratala Siva,) శర వేగంగా తెరకెక్కిస్తున్నాడు. ‘జనతా గ్యారేజ్’ (Janatha Garage) లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు కొరటాల శివతో ఎన్టీఆర్ చేస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ‘దేవర’ ప్రపంచం ఎలా ఉండబోతుందనేది ఇప్ప‌టికే శాంపిల్ చూపించిన కొర‌టాల‌.. ఈ మూవీపై హైప్‌ని స్కైహై గా పెంచేశాడు.. దీంతో.. జూనియ‌ర్ న‌ట విశ్వ‌రూపాన్ని ఎప్పుడెప్పుడు చూడ‌బోతామా అని ఫ్యాన్స్ ఎంత‌గానో ఎదురు చూస్తున్నారు.. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న దేవర ని సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే.. ఈ మూవీ రిలీజ్ డేట్ విష‌యంలో వ‌స్తున్న వార్త‌లు ఫ్యాన్స్‌ను క‌న్‌ఫ్యూజ‌న్ చేస్తున్నాయి. ఈ టైమ్‌లో దేవర’ రిలీజ్ పై త్వ‌ర‌లో క్లారిటీ రాబోతుందంటూ ఓ న్యూస్ ఇప్పుడు వైర‌ల్ అవుతోంది.

జూనియ‌ర్-కొర‌టాల (Junior-Coratala) కాంబోలో ఇప్ప‌టికే భారీ హిట్లు ప‌డ‌డంతో ఇప్పటికే వీరిద్దరి నుంచి భారీ హిట్లు పడడంతో.. దేవర మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఏప్రిల్ 5 కోసం అంద‌రూ ఎంతో ఆత్రుత‌గా ఎదురు చూస్తున్న వేళ‌… ఈ మూవీ రిలీజ్ వాయిదా ప‌డ‌నుంద‌న్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీలో విలన్ గా నటిస్తున్న సైఫ్ ఆలీ ఖాన్ (Saif Ali Khan) చేతికి ఇటీవల శస్త్ర చికిత్స జరగడంతో కొన్నాళ్లపాటు ఆయన రెస్ట్ తీసుకోనున్నారు. దానితో దేవర షూటింగ్ కి బ్రేక్ తప్పదని, అందుకే దేవర వాయిదా పడే ఛాన్స్ ఉందని కొన్నాళ్లుగా మీడియా మాధ్యమాల్లో కథనాలు వస్తున్నాయి. దీనిపై మూవీ టీమ్ నుంచి ఎలాంటి అనౌన్స్‌మెంట్ రాన‌ప్ప‌టికీ.. ఫ్యాన్స్ మాత్రం తెగ టెన్ష‌న్ ప‌డుతున్నారు. ఇక లేటెస్ట్ టాలీవుడ్ (Tollywood) బజ్ ప్రకారం మార్చి 8 న శివరాత్రి సందర్భంగా ఈ మూవీ రిలీజ్ పై మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నారని అంటున్నారు.

జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కాగా.. ఈ మూవీ నుంచి రీసెంట్‌గా కొంచెం గ్యాప్ తీసుకున్నారు మేకర్స్..
అయితే ఈ మార్చి 14 నుంచి మేకర్స్ కొత్త షెడ్యూల్ ని స్టార్ట్ చేస్తున్నట్టుగా అప్‌డేట్ వినిపిస్తోంది. ఇందులో భాగంగా కొంతమేర టాకీ పార్ట్ ని సహా కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లను కూడా తెరకెక్కించనున్నారట.. ఇక.. ఈ మూవీ నుంచి కేవలం సాంగ్స్ షూట్ మాత్రమే బ్యాలన్స్ ఉందట.. మ‌రి.. మార్చి 8న మేక‌ర్స్ ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారో.. దేవర ముందు అనుకున్న‌ట్లుగానే ఏప్రిల్ 5న విడుద‌ల అవుతుందా లేదా..? అన్న‌ది చూడాల్సిందే..