Kalki run time : ‘కల్కి’ రన్‌టైమ్‌ పై వచ్చేసిన క్లారిటీ

సమ్మర్ సీజన్ దాదాపు ముగిసింది. ఈ వేసవి అంతా వెండితెరపై సరైన మ్యాజిక్ సృష్టించిన సినిమాలేవీ రాలేదు. ఆ వెలితిని తీర్చడానికే రాబోతుంది రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఎ.డి’ (Kalki 2898 AD).

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 3, 2024 | 11:04 AMLast Updated on: Jun 03, 2024 | 11:04 AM

Clarity On Kalkis Runtime

సమ్మర్ సీజన్ దాదాపు ముగిసింది. ఈ వేసవి అంతా వెండితెరపై సరైన మ్యాజిక్ సృష్టించిన సినిమాలేవీ రాలేదు. ఆ వెలితిని తీర్చడానికే రాబోతుంది రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఎ.డి’ (Kalki 2898 AD). ప్రేక్షకుల్ని సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే చిత్రంగా ప్రచారంలో ఉన్న ‘కల్కి’ ప్రమోషన్స్ లో స్పీడు పెంచింది టీమ్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి పేరొచ్చింది. ముఖ్యంగా.. ప్రభాస్ పోషిస్తున్న భైరవ పాత్ర.. కస్టమ్ వెహికల్ బుజ్జి క్యారెక్టర్స్ ప్రేక్షకుల్లోకి చొచ్చుకెళ్లాయి.

ఇంకా.. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ పోషిస్తున్న అశ్వథ్థామ (Ashwathama) పాత్రపై కూడా హింట్ ఇచ్చింది టీమ్. అయితే.. ఈ మూవీలో మిగతా ప్రైమ్ క్యారెక్టర్స్ కమల్ హాసన్(Kamal Haasan), దీపిక పదుకొనె(Deepika Padukone), దిశా పటాని వంటి వారి పాత్రలపై క్లారిటీ రావాల్సి ఉంది. వారికి సంబంధించి స్పెషల్ గ్లింప్సెస్ రిలీజ్ చేయాల్సి ఉంది.

ఇక.. ‘కల్కి’ (Kalki) రిలీజ్ కు కేవలం మూడు వారాల సమయం మాత్రమే ఉంది. ఈనేపథ్యంలో.. ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా పూర్తవుతున్నట్టు తెలుస్తోంది. ‘కల్కి’ ఫైనల్ రన్ టైమ్ 2 గంటల 49 నిమిషాలు ఉండబోతుందట. పీరియాడికల్ టచ్ తో సాగే ఇలాంటి సినిమాల విషయంలో రన్ టైమ్ ఎక్కువగా ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ప్రేక్షకుల్ని ఆ కథలోకి తీసుకెళ్తే చాలు సినిమా సూపర్ డూపర్ హిట్ అయినట్టే. మొత్తానికి జూన్ 27న వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో ‘కల్కి’ రిలీజ్ కు రెడీ అవుతోంది.