Niharika second marriage : రెండో పెళ్లి కచ్చితంగా చేసుకుంటా
సినిమా నటి, మెగా ఇంటి ఆడబిడ్ద నిహారిక (Niharika) కొణిదెల (Konidela Family) రెండో పెళ్లికి సిద్ధంగానే ఉన్నట్లు సంచలన ప్రకటన చేసింది. ఈ సందర్భంగానే తన మొదటి పెళ్లి, విడాకుల (Divorce) గురించి మాట్లాడుతూ.. కాస్త ఎమోషనల్ అయింది.

Clarity on the second marriage of Mega Family Konidela Niharika
సినిమా నటి, మెగా ఇంటి ఆడబిడ్ద నిహారిక (Niharika) కొణిదెల (Konidela Family) రెండో పెళ్లికి సిద్ధంగానే ఉన్నట్లు సంచలన ప్రకటన చేసింది. ఈ సందర్భంగానే తన మొదటి పెళ్లి, విడాకుల (Divorce) గురించి మాట్లాడుతూ.. కాస్త ఎమోషనల్ అయింది. ఎవరూ కూడా పెళ్లి పెటాకులు అవుతుందని చేసుకోరని, కానీ, కొన్ని సార్లు అలా జరిగిపోతుందని అన్నారు. అలాగే మళ్లీ పెళ్లి చేసుకోవడంపై కూడా నిహారిక స్పందించారు.
హోప్ ఫుల్లీ, తనకింకా 30 ఏళ్లు మాత్రమే అంటూ బదులిచ్చారు నిహారిక. రెండో పెళ్లి చేసుకోవడానికి తనకేమి అభ్యంతరం లేదని, చేసుకోవద్దని బలంగా ఫిక్స్ అవ్వలేదనే విషయాన్ని స్పష్టం చేశారు. మళ్లీ పెళ్లి చేసుకుని, వివాహ బంధంలోకి అడుగుపెట్టేందుకు తాను సుముఖంగానే ఉన్నట్లు వెల్లడించారు. అలాగని.. పెళ్లి కోసం తాను పరుగులు పెట్టడం లేదని, ఎవర్ని చేసుకోవాలని ఎవర్ని చేసుకోవాలంటూ తాను పెళ్లి వెంట పడననని అన్నారు. భవిష్యత్తులో మళ్లీ పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేశారు.
విడాకులు సమయంలో తన తండ్రి నాగబాబు (Naga Babu) తన కోసం నిలబడిన విధానం గురించి నిహారిక చెప్పిన విషయాలు కంటతడి పెట్టించేలా ఉన్నాయి. ఒక తండ్రి తన కూతురి కోసం ఎంత దూరమైనా వెళ్తాడు, ఏమైనా చేస్తాడనే దానికి అవి నిదర్శంగా కనిపిస్తున్నాయని అన్నారు. రెండో పెళ్లి పై ఎంతో హుందాగా, మెచ్యూర్‌గా సమాధానం ఇవ్వడంపై నిహారిక కి నెటిజన్లు సైతం సపోర్ట్‌గా నిలుస్తున్నారు.