హిందూపూర్ సీట్ వద్దన్న బాల్యయ్య.. ఇద్దరి మధ్య నలిగిపోతున్నా అంటూ చంద్రబాబు కామెంట్స్
నందమూరి బాలకృష్ణ కు పద్మభూషణ్ అవార్డు రావడంతో ఆయన చెల్లెలు నారా భువనేశ్వరి హైదరాబాదులోనే ఒక ఫామ్ హౌస్ లో పార్టీ ఇచ్చారు.
నందమూరి బాలకృష్ణ కు పద్మభూషణ్ అవార్డు రావడంతో ఆయన చెల్లెలు నారా భువనేశ్వరి హైదరాబాదులోనే ఒక ఫామ్ హౌస్ లో పార్టీ ఇచ్చారు. సినిమా పరిశ్రమకు బాలయ్య చేసిన సేవలు గాను కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆయనకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించడంతో నందమూరి నారా కుటుంబాల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఇక లేటెస్ట్ గా నిర్వహించిన పార్టీకి ఏపీ సీఎం చంద్రబాబుతో పాటుగా పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు జోకులు వేసుకున్నారు ఇక ఆసక్తికర ప్రశ్నలు అడుగుతూ సందడి చేశారు. బాలకృష్ణకు పలు ప్రశ్నలు అందించారు నారా భువనేశ్వరి అలాగే పురందరేశ్వరి.
ఇక ఈ కార్యక్రమానికి హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నందమూరి బాలకృష్ణ నిన్నటిదాకా అల్లరి బాలయ్య అని ఇప్పుడు పద్మభూషణుడు అంటూ చంద్రబాబు కొనియాడారు. ఇప్పుడైనా బాధ్యత మరింత పెరిగిందని ఎన్టీఆర్ను గుర్తు చేసుకునేలా బాలయ్య ప్రతి పని చేస్తున్నారని ఆయనకు పద్మభూషణ్ అవార్డు రావడం నా కుటుంబ సభ్యుడు కావడం గర్వంగా ఉందన్నారు చంద్రబాబు. ఇది ప్రారంభం మాత్రమే అని అన్ స్టాపబుల్ లో ఇది తొలిమెట్టు అనుకోవచ్చు అంటూ చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇక ఈ కార్యక్రమంలో బాలయ్యను చంద్రబాబు నాయుడు అభినందించారు. వేదికపై బాలయ్యను తన భార్య భువనేశ్వరుని చమత్కరిస్తూ మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఒకపక్క బాలయ్య మరోపక్క పవర్ఫుల్ భువనేశ్వరి మధ్యలో నలిగిపోతున్నా అంటూ కామెంట్స్ చేశారు. వీరిద్దరి మధ్య ఉంటే చాలా ప్రమాదకరమని భువనేశ్వరి తన అన్నయ్య మీద ఉన్న ప్రేమతో ఈ వేడుక చేస్తోందన్నారు. ప్రతి ఒక్కరు జీవితంలో ఏదో ఒక ఫీల్డ్ లో ఏదో ఒకటి సాధించాలనుకుంటామని బాలయ్య 1974లో నటుడుగా కెరీర్ ప్రారంభించారని నేను 1978లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యానని చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకున్నారు. తనకంటే బాలకృష్ణ నాలుగేళ్లు సీనియర్ అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు చంద్రబాబు.
బాలకృష్ణ పైకి అల్లరిగా కనిపిస్తాడని కానీ లోపల చాలా డెప్త్ ఉందంటూ చంద్రబాబు ఆకాశానికి ఎత్తేశారు. 50 ఏళ్లుగా సినిమాల్లో ఎవర్ గ్రీన్ హీరోగా రాణిస్తున్నారని నేటి తరం డైరెక్టర్లతో కలిసి విభిన్నమైన చిత్రాల్లో యాక్టింగ్ చేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. గొప్ప మానవతా వాదని క్యాన్సర్ ఆసుపత్రి ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దామని హీరోగా ఎమ్మెల్యేగా సక్రమంగా విధులు నిర్వహిస్తున్నారు అన్నారు చంద్రబాబు నాయుడు. ఒక్కోసారి హిందూపురం సీట్ తన భార్య వసుంధరకు ఇవ్వాలని బాలయ్య ఒత్తిడి చేస్తాడని నిజంగా అంటాడో ఆమెను మెప్పించడానికి అంటాడో తెలియదని ఎంత ఎమోషనల్ గా ఉంటాడో అంత మంచి మనిషి అన్నారు చంద్రబాబు.